కీలక భేటీ కోసం లోకేష్ ఢిల్లీలో వెయిటింగ్...?
తన తండ్రి చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడం అందులో ఒకటి. అలాగే ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ మీద హోరెత్తించి దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయడం మరోటి.
By: Tupaki Desk | 20 Sep 2023 4:00 AM GMTచంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ ఢిల్లీ టూర్ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని అంటున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళింది అనేక కీలక పనుల మీద అని అంటున్నారు. న్యాయ నిపుణులతో చర్చించి ఎలాగైనా తన తండ్రి చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడం అందులో ఒకటి. అలాగే ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ మీద హోరెత్తించి దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయడం మరోటి. అలాగే పార్లమెంట్ లో బాబు అరెస్ట్ మీద ఎంపీల ద్వారా అడిగించడం.
ఇవన్నీఎంతో కొంత వరకూ అవుతున్నాయి. కానీ మరో అతి ముఖ్యమైన పని మాత్రం పెండింగులో పడింది అని అంటున్నారు. అదేంటి అంటే బీజేపీ పెద్దలను కలవడం. వారితో భేటీ అయి తిరిగి రావాలని లోకేష్ పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు అరెస్ట్ ని కేంద్ర పెద్దలతో చెప్పి అటు నుంచి వైసీపీ సర్కార్ ని కట్టడి చేయాలన్నదే లోకేష్ కి ఆయన తండ్రి చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ అని అంటున్నారు.
దాని కొసమే గత అయిదారు రోజులుగా లోకేష్ ఢిల్లీలో ఉండి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కేంద్ర పెద్దలతో లోకేష్ భేటీకి టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే అవి ఇప్పటిదాక సఫలం కాలేదని అంటున్నారు.
ఇంకో విషయం ఏంటే బీజేపీ కూడా ఫుల్ బిజీగా ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల హడావుడిలో అటే ఫోకస్ పెట్టింది. పార్టీ కీలక నేతలు అంతా అందులోనే మునిగి తేలుతున్నారు. ఈ నెల 22 వరకూ స్పెషల్ సెషన్స్ జరుగుతాయి. దాంతో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరుకుతుందా అన్నది ఇపుడు ప్రశ్నగా ఉంది.
అయితే లోకేష్ పట్టుదల అయితే కచ్చితంగా కలసిరావాలనే అంటున్నారు. ఈలోగా హైకోర్టులో బాబు తరఫున వేసిన క్వాష్ పిటిషన్ మీద తీర్పు అనుకూలంగా వస్తే కనుక చంద్రబాబు బయటకు వస్తారు. అపుడు చంద్రబాబే ఢిల్లీ టూర్ పెట్టుకుంటారు. రెండు రోజులలో ఈ విచారణ మీద తీర్పు వస్తుంది అని అంటున్నారు. అంతవరకూ లోకేష్ ఢిల్లీలో ఉంటారు అని అంటున్నారు. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే లోకేష్ కచ్చితంగా కేంద్ర పెద్దలతో భేటీ కావడానికి ఉండాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ ఢిల్లీ టూర్ లో అనుకున్న పని కాలేదని అందుకే ఆయన హస్తిన మకాం ఇంకా కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.