Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూర్ ఆయాసమేనా...లోకేష్ ఏం చేస్తారో...?

లోకేష్ నాలుగైదు రోజుల పాటు చేసిన ఢిల్లీ టూర్ వల్ల ఆయాసమే మిగిలింది అని అంటున్నారు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలతో లోకేష్ ఇబ్బంది పడ్డారు అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 11:30 PM GMT
ఢిల్లీ టూర్ ఆయాసమేనా...లోకేష్  ఏం చేస్తారో...?
X

తండ్రి చంద్రబాబు జైలులో ఉన్నారు. కుమారుడు లోకేష్ తండ్రి అరెస్ట్ ని ఆయనకు జరిగిన అన్యాయన్ని జాతి మొత్తానికి చెప్పాలని జాతీయ మీడియా సాయంతో మొత్తం రాజకీయాన్ని కదిలించాలని భావించి ఢిల్లీ బాట పట్టారు. అయితే హస్తిన టూర్ వల్ల గుడ్ రిజల్ట్ అయితే ఏమీ లేదని అంటుననరు.

లోకేష్ నాలుగైదు రోజుల పాటు చేసిన ఢిల్లీ టూర్ వల్ల ఆయాసమే మిగిలింది అని అంటున్నారు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలతో లోకేష్ ఇబ్బంది పడ్డారు అంటున్నారు. కింది స్థాయి అధికార్లు తప్పు చేస్తే సీఎం ని ఎలా బాధ్యులను చేస్తారు అని ఏదో ప్రశ్న వేశాననుకున్న లోకేష్ మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం జరిగింది అని ధృవీకరించారా అన్న చర్చ నడుస్తోంది.

అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 90 శాతం వాటాను వారు రిలీజ్ చేయకుండానే పది శాతం వాటాను ఎలా రిలీజ్ చేశారు అని అడిగిన ప్రశ్నకు లోకేష్ జవాబు చెప్పలేక తడబడ్డారని వైసీపీ అయితే గట్టిగానే విమర్శిస్తోంది.

ఇంకో వైపు జాతీయ స్థాయి నేతల మద్దతు కూడా కరవు అయింది అంటున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ కోసం అపాయింట్మెంట్ ని అడిగారని అంటున్నారు. టీడీపీకి బీజేపీకి పూర్తిగా కావాల్సిన వారు ఈ రకంగా ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం ఏమీ లేదని అంటున్నారు.

పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ మీద టీడీపీ ఎంపీలు అయితే గట్తిగానే అడిగారు. కానీ అంతకంటే గట్టిగా ఘాటుగా వైసీపీ ఎంపీల నుంచి కూడా రిప్లై వచ్చింది అంటున్నారు. మరో వైపు చూస్తే పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలతో సీనియర్ నేతలతో కలసి లోకేష్ ధర్నా కార్యక్రం కొంతసేపు నిర్వహించగలిగారు.

లోకేష్ ఢిల్లీ టూర్ కి వెళ్ళినపుడు పెట్టుకున్న ఆశలు వేరు, స్ట్రాటజీలు వేరు అంటున్నారు. కానీ అక్కడ ఏమీ అనుకున్న విధంగా సాగలేదని అంటున్నారు. ఇంకో వైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ మంగళవారాం కోర్టు ముందుకు విచారణకు వస్తోంది. దాంతో లోకేష్ మంగళవారం నాటికి రాజమండ్రికి తిరిగి చేరుకుంటున్నారు అని అంటున్నారు.

ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ వస్తే ఓకే. కానీ అలా రాకపోతే మాత్రం లోకేష్ టీడీపీ ఏమి చేయబోతారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. లోకేష్ తన ప్రయత్నాలు తాను చేశారు. ఒక విధంగా చెప్పలంటే శక్తికి మించే ఢిల్లీలో తిరిగారు. కానీ ఎక్కడా వర్కౌట్ కాలేదు, దాంతో ఆయన ఏమి చేయబోతున్నారు అన్నది ఒక ప్రశ్నగా ముందుంది. అదే టైం లో లోకేష్ ని అరెస్ట్ చేయాలని సీఐడీ డిపార్ట్మెంట్ కాచుకుని కూర్చుని ఉందని అంటునారు. అదే నిజం అయితే మరిన్ని కొత్త సమస్యలతో టీడీపీ కూరుకునిపోతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.