తొలిసారి గవర్నర్ దగ్గరకు నారా లోకేష్.. ఏం చెప్పారంటే!
ఇక, గవర్నర్ కు కీలకమైన రెండు విషయాల పై నారా లోకేష్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 15 July 2023 10:12 AM GMTఏపీ లో విపక్ష నాయకుడిగా ఉన్న టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తొలిసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. నిజానికి నాలుగేళ్లుగా విపక్షం లో ఉన్నప్పటికీ.. ఎప్పుడూ గవర్నర్ ను కలుసుకోక పోవడం గమనార్హం. అయితే.. అనూహ్యంగా ఈ థాట్ చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వెళ్లిపోవాలి. కానీ ఆయన గవర్నర్ ను కలిసేందుకు ఉండవల్లి నుంచి విజయవాడకు వచ్చారు.
ఇక, గవర్నర్ కు కీలకమైన రెండు విషయాల పై నారా లోకేష్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఒకటి గంజాయి. రెండు వలంటీర్ వ్యవస్థ, మూడు వైసీపీ నేతల అవినీతి. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ అనేక మంది ప్రజలను కలు స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు వివిధ సందర్భాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు.. తాను స్వయంగా చూసిన విషయాల ను కూడా గవర్నర్ వద్ద ప్రస్తావించారు.
ప్రస్తుతం రాష్ట్రం లో భారీ ఎత్తున రెండు రోజుల కొక సారి గంజాయి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఇటీవల కాలంలో వలంటీర్ వ్యవస్థతోపాటు నేతల అవినీతి పై కూడా పెద్ద ఎత్తున విమర్శ లు వచ్చాయి. వాటిని ప్రత్యేకంగా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు నారా లోకేష్ తెలిపారు. ఇక, వలంటీర్ వ్యవస్థ ప్రజల నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించడం.. ఓట్ల విషయం లో వారి పై ఒత్తిడి తేవడం వంటి విషయాల ను కూడా నారా లోకేష్ వివరించినట్టు తెలిసింది.
నారా లోకేష్ సదరు విషయాల ను పూస గుచ్చినట్టు ఆధారాలతో సహా వివరించడంతో గవర్నర్ ఆశ్చర్యం గా ప్రశ్నించారని.. పార్టీ కీలక నాయకులు తెలిపారు. ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్నారని.. తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని.. గవర్నర్ నారా లోకేష్ ను చాలా ఆప్యాయంగా పలకరించారని నాయకులు చెప్పడం విశేషం.