Begin typing your search above and press return to search.

బాబుకు తొలిరోజు గడిచింది ఇలా... భోజనం తయారీ అలా!

అవును... చంద్రబాబు తనకు ఇంటి నుంచి తెప్పించిన భోజనం తినే అవకాశం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sep 2023 3:43 AM GMT
బాబుకు తొలిరోజు గడిచింది ఇలా... భోజనం తయారీ అలా!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22 వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వస్తుంది! ఈ క్రమంలో ఆయన అడిగిన రెండు రిక్వస్టుల్లోనూ ఒక పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. అదే... ఇంటి భోజనం!

అవును... చంద్రబాబు తనకు ఇంటి నుంచి తెప్పించిన భోజనం తినే అవకాశం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాజమండ్రిలో ఇంటి నుంచి భోజనం ఎలా... హోటల్ కి ఆర్డర్ ఇస్తారా.. లేక, బుచ్చయ్య చౌదరి లాంటి స్థానిక నేతల ఇంటినుంచి తెప్పిస్తారా అనే చర్చ శ్రేణుల్లో జరిగింది.

అయితే అలా ఎవరి ఇంటి నుంచీ, హోటల్ నుంచీ కాకుండా స్థానికంగానే సిద్ధం చేయిస్తున్నారు ఆయన తనయుడు నారా లోకేష్. ఇందులో భాగంగా... ఆయనకు మూడు పూటలా భోజనం పంపించేలా లోకేష్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తండ్రికి బెయిల్ రావడానికి అవిరామంగా ప్రయత్నిస్తున్న లోకేష్... జైలుకు సమీపంలోని హరిపురం ప్రాంతంలో తన కార్ వ్యాన్ లో ఉంటున్నారు.

దీంతో... ఆ కార్ వ్యాన్ ప్రక్కనే మరో వ్యాన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే వంట చేస్తున్నారు. ఆ కార్ వ్యాన్ నుంచే సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు మూడు పూటలా భోజనం పంపుతున్నారు.

ఇందులో భాగంగా రెండో రోజు చంద్రబాబు ఉదయం ఐదున్నర ప్రాంతంలోనే నిద్రలేచారని తెలుస్తుంది. అనంతరం యోగా, మెడిటేషన్ చేశారంట. ఈ సమయంలో బ్లాక్ కాఫీ తాగుతూ... న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారట చంద్రబాబు.

తొలిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ తీసుకున్న చంద్రబాబు... మధ్యాహ్నం 100 గ్రాముల బ్రౌన్‌ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్‌ కూర, పెరుగుతో చంద్రబాబు భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేశారు. రాత్రి కూడా ప్యాంట్రీ కారు నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని పంపారు. ఇదే సమయంలో రాత్రి భోజనంలోకి పుల్కాలు మాత్రమే తీసుకున్నారట.

ఇక, తొలిరోజు తెల్లవారుజామున 4 గంటలవరకూ మెలుకువగానే ఉన్న చంద్రబాబు... ఆ తర్వాత పడుకుని ఉదయం 8 గంటలకు నిద్రలేచారంట. అనంతరం కాసేపు వాకింగ్ చేసి, న్యూస్ పేపర్స్ చదివారంట. ఇలా సెంట్రల్ జైల్లో చంద్రబాబు తొలిరోజు గడిచిందన్ని సమాచారం! ఈ క్రమంలో... ఉదయం అల్పాహారం తీసుకున్నాక, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలుస్తుంది!

మరోపక్క జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను ఏర్పాటు చేశారట. ఇదే క్రమంలో... జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారని.. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

కాగా... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. రిమాండ్‌ ఖైదీగా ఆయనకు 7691 నంబర్‌ ను కేటాయించారు.