Begin typing your search above and press return to search.

లోకేష్ రెడ్ బుక్ లో రెండు కమ్మ..ఒక రెడ్డినా...!?

ఇల లోకేష్ రెడ్ బుక్ లో చాలా పేర్లు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రతీ జిల్లాలో కూడా కీలకమైన వైసీపీ నేతల పేర్లు నోట్ చేసుకుని ఉంచారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:15 PM GMT
లోకేష్ రెడ్ బుక్ లో రెండు కమ్మ..ఒక రెడ్డినా...!?
X

రెడ్ బుక్ లో అందరి చిట్టా ఉందని టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రతీ సభలో చెబుతూ వస్తున్నారు. ఆయన యువగళం నుంచి ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలలో శంఖారావం సభలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా లోకేష్ రెడ్ బుక్ లో అందరి చిట్టా ఉంది అని వైసీపీ నేతలకు ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు.

మరి లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు రాస్తున్నారు. ఇందులో టాప్ ప్లేస్ లో ఎవరివి ఉంటాయన్న చర్చ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. లోకేష్ ఇలా రెడ్ బుక్ ని చూపిస్తూ ప్రతీ మీటింగులోనూ వైసీపీ వారిని హడలెత్తించేలా మాట్లాడుతున్నారు.

ఇల లోకేష్ రెడ్ బుక్ లో చాలా పేర్లు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రతీ జిల్లాలో కూడా కీలకమైన వైసీపీ నేతల పేర్లు నోట్ చేసుకుని ఉంచారని అంటున్నారు. అయితే టాప్ లో మాత్రం ఒకటి రెండు స్థానాల్లో ఇద్దరు కమ్మ నాయకుల పేర్లు ఉన్నాయని అలాగే మూడవ పేరు ఒక రెడ్డి నాయకుడిది అని అంటున్నారు.

ఆ కమ్మ నాయకులు ఎవరు అంటే ఒకరు కొడాలి నాని, రెండవవారు వల్లభనేని వంశీ అని అంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని మీద చూస్తే సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైపోయింది అని అంటున్నారు.

ఇక లోకేష్ రెడ్ బుక్ లో సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి టాప్ వైసీపీ లీడర్స్ తో పాటు సీఐడీలో ఉన్న కొందరు అధికారుల పేర్లు కూడా రాసి పెట్టుకున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఇలా రెడ్ బుక్ లో అనేక మంది పేర్లు ఉన్నా కొడాలి నాని వంశీ, ద్వారంపూడి పేర్ల విషయంలో మాత్రమే డిస్కషన్ సాగుతోంది.

తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి మీద చర్యలు గట్టిగా ఉంటాయని లోకేష్ పదే పదే సభలలో చెబుతున్నారు. లోకేష్ యువగళంలో కూడా ప్రజా సమస్యలు చెప్పారు కానీ ఎక్కువగా రెడ్ బుక్ లో పేర్ల గురించే అపుడూ చర్చ సాగింది. మేము గుర్తు పెట్టుకుంటాం ఇంతకు ఇంత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని కూడా అంటున్నారు.

ఇక శంఖారావం సభలలో అయితే లోకేష్ నా తాత ఎన్టీయార్ దేవుడు, మా నాన్న చంద్రబాబు రాముడు, నేను మాత్రం వైసీపీ వారికి మూర్ఖుడిని అని కూడా డైలాగులు కొడుతున్నారు. నేను ఎవరి మాటా వినను అని ఆయన అంటున్నారు. వైసీపీ నేతలకు కచ్చితంగా యాక్షన్ ఉంటుందని ఆయన వార్నింగ్ సీరియస్ గానే ఇస్తున్నారు. అయితే లోకేష్ ఎర్ర బుక్ మీద వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు ఎవరిని బెదిరించడానికి అని కూడా అంటున్నారు.

నీ ఎర్ర బుక్ నీ దగ్గరే పెట్టుకో అని కూడా వైసీపీ మంత్రులు అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు చేసేది లేదు అని ఎకసెక్కమాడుతున్నారు. మరి లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు ఏమిటి అన్నది ఒక వైపు చర్చ అయితే మరో వైపు చూస్తే టీడీపీ పవర్ లోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.