Begin typing your search above and press return to search.

వాడు.. వీడు... విజయ సాయిరెడ్డిని తగులుకున్న లోకేష్!

ఈ సందర్భంగా విలేకరులను ఉద్దేశించి సాయిరెడ్డి వాడిన భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2024 8:30 AM GMT
వాడు.. వీడు... విజయ సాయిరెడ్డిని తగులుకున్న లోకేష్!
X

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శాంతితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా విలేకరులను ఉద్దేశించి సాయిరెడ్డి వాడిన భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అవును... తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా తన వివరణ ఏమాత్రం తీసుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు ప్రసారాలు చేసిందని, డిబేట్లు పెట్టిందని విజయసాయిరెడ్డి కొన్ని మీడియా ఛానల్స్ పై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన జర్నలిస్టులపై అభ్యంతరకర పదజాలం వాడారనే చర్చ విపరీతంగా వినిపిస్తోంది.

ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్న విలేకరులతో పాటు.. అక్కడ లేని పలువురు జర్నలిస్టులనూ ఏకవచనంతో ప్రస్థావించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఓరేయ్.. ఏరా.. ఏంట్రా బాబూ.. చెప్పారా.. ఎవడ్నీ వదలిపెట్టను.. ఆ టీవీ ఛానల్ లో కూర్చున్నవాడికి తల్లీ, చెల్లీ లేరా... అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర పదజాలం ప్రయోగించారు!

దీంతో... తనకున్న ఆక్రోశాన్నో, ఆగ్రహాన్నో జర్నలిస్టులపై చూపించే ప్రయత్నం చేశారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో.. ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి వాడిన పదజాలాన్ని తప్పుబట్టారు. ఆ భాష తీవ్ర అభ్యంతరకరం అని అన్నారు. అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని దుబ్బయట్టారు.

ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రలేదా అని ఫైరయ్యారు. సాయిరెడ్డి వాడిన పదజాలాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "విజయసాయిరెడ్డి గారూ!" అని మొదలుపెట్టిన లోకేష్... "మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్‌ లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు" అని అన్నారు.

ఇదే సమయంలో... "మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు" అంటూ ఫైరయ్యారు!