Begin typing your search above and press return to search.

'ఇండియా' కూటమి గెలుస్తుందా... అన్ని బెట్టింగ్ యాప్స్ రిజల్ట్ ఇదే!

అవును... ఈసారి జరిగిన ఎన్నికల్లో ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రసారం జరిగిందనే చర్చ జరిగింది. ఫేక్ సర్వేలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి.

By:  Tupaki Desk   |   31 May 2024 5:07 AM GMT
ఇండియా కూటమి గెలుస్తుందా... అన్ని బెట్టింగ్  యాప్స్  రిజల్ట్  ఇదే!
X

దేశంలో లోక్ సభ ఎన్నికల సందడి చివరి దశకు వచ్చింది. ఇందులో భాగంగా ఏడొవది, చివరిదశ పోలింగ్ జూన్ 1న జరగబోతుంది.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సమయంలో జాతీయ స్థాయిలో ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య రసవత్తరపోరు ఉంటుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన ఫలితాల అంచనాల న్యూస్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ఈసారి జరిగిన ఎన్నికల్లో ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రసారం జరిగిందనే చర్చ జరిగింది. ఫేక్ సర్వేలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. వీటికి ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలేమీ లేవు.. దాదాపుగా అన్ని పార్టీల తరుపునా కొన్ని ఫేక్ సర్వేలు సర్క్యులేట్ అయ్యాయి! ఈ క్రమంలో తాజాగా వివిధ బెట్టింగ్ యాప్ ల నుంచి వచ్చిన ప్రిడిక్షన్లను ఆధారంగా ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది.

ఇందులో భాగంగా పలు బెట్టింగ్ యాప్ ల అంచనాలను ఆధారం చేసుకుని హిందీ మీడియా సంస్థ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఓ గ్రాఫిక్ షీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షీట్ లోని ఫలితాలో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టిపోటీ ఇచ్చినట్లుగా ఉంది. దీంతో ఈ వ్యవహారంపై ఆ హిందీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్పందించారు.. అది ఫేక్ అని ఎక్స్ లో పేర్కొన్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ సత్తా బజార్ గ్రాఫిక్ షీట్ లో.. ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ 272 కంటే తక్కువగా సీట్లు వస్తాయని సూచిస్తోంది. ఇదే సమయంలో... కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వస్తుందని అంచనా వేసింది. అంటే.. దాదాపుగా నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చని మెజారిటీ యాప్స్ వెల్లడించాయన్నమాట.

ఈ అంచనాల ప్రకారం.. పాలన్‌ పూర్, కర్నాల్, బోహ్రీ, బెల్గాం, కోల్‌ కతా, ఫలోడి, విజయవాడ, అహ్మదాబాద్‌ లలోని మార్కెట్లు నెక్ టూ నెక్ పోటీ ఉంటుందని సూచిస్తుండగా.. ఇండోర్ సరాఫా, సూరత్ మఘోబి మాత్రం ఎన్డీయే వైపు మొగ్గు చూపాయి. అయితే ప్రముఖ హిందీ ఛానల్ పేరున సర్క్యులేట్ అవుతున్న ఈ వ్యవహారంపై ఆ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా... "ఫేక్ అలర్ట్: ఈ ఫేక్ న్యూస్ మా పేరు మీద వైరల్ అవుతోంది. న్యూస్-24 అలాంటి కథనాలను ప్రచురించలేదు. జాగ్రత్తగా ఉండండి" అని రాసుకొచ్చారు. దీంతో... ఇదంతా బెట్టింగ్ మార్కెట్ మాయలో ఒక భాగం అని అంటున్నారు. కాగా... బెట్టింగ్ ల వల్ల జీవితాలు, కుటుంబాలు నాశనమైపోతాయనేది తెలిసిన విషయమే!