Begin typing your search above and press return to search.

బీజేపీ రాష్ట్రాలలో ఏదో జరుగుతోంది...?

కుల సమీకరణలతో నెట్టుకుని రావాల్సిన చోట ఆ లెక్కలు పక్కన పెట్టేసి మత సమీకరణల మీద కూడా కొత్త లెక్కలతో వస్తున్నారు

By:  Tupaki Desk   |   4 May 2024 1:30 PM GMT
బీజేపీ రాష్ట్రాలలో ఏదో జరుగుతోంది...?
X

బీజేపీకి పట్టున చోట ఏదో జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. బీజేపీకి మొదటి నుంచి కొమ్ము కాస్తూ వస్తున్న రాష్ట్రాలు కీలక స్థావరాలలో తేడా ఏమైనా కొడుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. అగ్రెసివ్ మోడ్ లో వారి మాటలు ఉపన్యాసాలు ఉన్నాయి అని విశ్లేషిస్తున్నారు.

కుల సమీకరణలతో నెట్టుకుని రావాల్సిన చోట ఆ లెక్కలు పక్కన పెట్టేసి మత సమీకరణల మీద కూడా కొత్త లెక్కలతో వస్తున్నారు. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల రద్దు మీద పెద్దగా మాట్లాడుతున్నారు. దీంతోనే అనేక రకాలైన డౌట్లు వస్తున్నాయి. హిందువుల ఓట్లు ఏవీ బీజేపీకి ఈసారి గంపగుత్తగా పడవా అన్న సందేహాలకు కూడా తెర లేస్తోంది.

కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలు బీజెపీతోనే ముందుకు సాగుతూ వచ్చిన పరిస్థితి గత రెండు ఎన్నికల్లోనూ అంతా చూశారు. కాషాయ జెండా నీడలోనే కీలక రాష్ట్రాలు చేరి బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీని కట్టబెట్టిన ఉదంతాలను కూడా చూశారు.

కానీ ఇపుడు చూస్తే సీన్ బాగా మారుతోంది అని అర్ధం అవుతోంది. దాంతో పాటు కుల సమీకరణలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. హిందూ సమాజం ఒక్కటిగా మారితే అది భారీ ఓటు బ్యాంక్ అవుతుంది. అదే బీజేపీకి శ్రీరామరక్షగా ఉంటుంది. కానీ ఇపుడు ఉత్తరాదిన మత సమీకరణలు కంటే కుల సమీకరణలు డామినేట్ చేస్తున్న నేపధ్యం కనిపిస్తోంది.

ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టేది అని అంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీకి ఉత్తరాదిన ఏదో తెలియని భయాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఎండలకు జడిసి ఓట్లు వేయకుండా అక్కడ జనాలు ఉండరు. కానీ తొలి విడత మలి విడత పోలింగ్ చూస్తే తక్కువ శాతం నమోదు అయింది. ఇది ఓటర్లలో నిర్లిప్తత తో పాటు బీజేపీ పట్ల వైముఖ్యత కూడా పెంచుతోందా అన్న చర్చ ఉంది.

ఈ కారణంగానే బీజేపీ అగ్ర నేతలు ఉలిక్కి పడి తరువాత కార్యాచరణకు నడుం బిగించారు. అని అంటున్నారు. మొత్తం రెండు విడతలుగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో 192 సీట్లకు గానూ బీజేపీకి వందకు పైగా వస్తాయని బీజేపీ అగ్రనేత అమిత్ షా చెబుతున్నప్పటికీ బీజేపీకి లోలోపల సందేహాలు అనేకం ఉన్నాయని అంటున్నారు

ఓటింగ్ సరళికి సంబంధించి బీజేపీ పెద్దల వద్ద కీలక సమాచారమే ఉంది అని అంటున్నారు. అది బీజేపీకి సానుకూలంగా ఉంటే కనుక బీజేపీ అగ్ర నేతలు ఇంత అగ్రెసివ్ మూడ్ లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు సిద్ధపడరని అంటున్నారు. హిందూత్వ మంత్రం ఈసారి పండడం లేదన్న సంకేతాలతోనే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ స్వరం పెంచిందని అంటున్నారు.

అంటే మరోమారు హిందూత్వను రగిలించకపోతే బీజేపీకి పట్టున్న రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో నంబర్ రాదు అన్నది కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీకి ఇపుడు అర్జంటుగా భావోద్వేగ నినాదం కావాల్సి ఉంది అని అంటున్నారు. మత పరమైన రిజర్వేషన్లు అంశం అంది పుచ్చుకున్నా అది పెద్దగా జనాల్లోకి ఎక్కడంలేదని, అనుకున్న స్థాయిలో చర్చకు రావడం లేదని అంటున్నారు.

దాంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద కూడా మాట్లాడుతోంది. ఆఖరుకు రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడం మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తున్నారు దీనిని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు కూడా. రెండు చోట్ల పోటీ చేయడం 2014లో నరేంద్ర మోడీ కూడా చేశారని గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎమోషనల్ గా జనాలతో కనెక్ట్ అయ్యే ఇష్యూ ఈసారి లేకపోవడం ఎన్ని విభేదాలు ఉన్నా ఇండియా కూటమి ఐక్యంగానే బీజేపీని ఢీ కొంటూ కీలక రాష్ట్రాలలో నిలువరించే ప్రయత్నాలు చేయడం పోలింగ్ శాతం తగ్గడం వంటి అంశాలు కమలనాధులను కలవరపెడుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు బీజేపీ ఏ రకమైన కొత్త వ్యూహాలను అనుసరిస్తుందో.