ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు.. పూర్తి వివరాలివే!
లోక్ సభ తోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
By: Tupaki Desk | 16 March 2024 11:58 AM GMTదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కు షెడ్యూల్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్ సభ పోలింగ్:
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేరోజు లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ లోక్ సభ ఎన్నికలకూ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో 25, తెలంగాణలోని 17 లోక్ ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా... ఏపీలో అదే రోజు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మే 13న తెలంగాణలో ఉప ఎన్నిక!:
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకూ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో మొత్తం ఏడు దశల్లో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఖాళీ అయిన తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానానికి మే 13న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు:
లోక్ సభ తోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఒకే దశలో పోలింగ్ జరగనుండగా... ఒడిశాలో మాత్రం నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 175 స్థానాలున్న ఏపీకి మే 13న, 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇదే క్రమంలో 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలోను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో మాత్రం నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా... మే 13, మే 20, మే 25, జూన్ 1 న ఎన్నికలు జరగనున్నాయి.
543 లోక్ సభ స్థానాలు.. 7 దశలు!
సుమారు 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్న ఈ దేశంలో 543 లోక్ సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఆ ఏడు విడతలకు సంబంధించిన నోటిఫికేషన్, నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తేదీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం...!
తొలి దశ:
నోటిఫికేషన్ - మార్చి 20
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మార్చి 27
నామినేషన్ల పరిశీలన - మార్చి 28
ఉపసంహరణకు చివరి తేదీ - మార్చి 30
పోలింగ్ తేదీ - ఏప్రిల్ 19
రెండో దశ:
నోటిఫికేషన్ - మార్చి 28
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 5
ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్ తేదీ - ఏప్రిల్ 26
మూడో దశ:
నోటిఫికేషన్ - ఏప్రిల్ 12
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 20
ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ - మే 7
నాలుగో దశ:
నోటిఫికేషన్ - ఏప్రిల్ 18
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ - మే 13
ఐదో దశ:
నోటిఫికేషన్ - ఏప్రిల్ 26
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 3
నామినేషన్ల పరిశీలన - మే 4
ఉపసంహరణకు చివరి తేదీ - మే 6
పోలింగ్ తేదీ - మే 20
ఆరో దశ:
నోటిఫికేషన్ - ఏప్రిల్ 29
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 6
నామినేషన్ల పరిశీలన - మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ - మే 9
పోలింగ్ తేదీ - మే 25
ఏడో దశ:
నోటిఫికేషన్ - మే 7
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 14
నామినేషన్ల పరిశీలన - మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ - మే 17
పోలింగ్ తేదీ - జూన్ 1