ఓటు వేసేటప్పుడు మొబైల్ తీసుకెళ్లొచ్చా?
లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, కెమెరా, ఇయర్ ఫోన్ లు వంటివి తీసుకెళ్లడం నిషేధం.
By: Tupaki Desk | 12 May 2024 7:15 AM GMTమే 13న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఓటు వేసే క్రమంలో మనం ఏం తీసుకెళ్లాలనే దానిపై ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది. ఈనేపథ్యంలో మొబైల్, కెమెరాలు తీసుకెళ్లరాదనే విషయాలు తెలుసుకోవడం మంచిది.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు మొబైల్, కెమెరాలు వంటివి తీసుకెళ్లవచ్చా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, కెమెరా, ఇయర్ ఫోన్ లు వంటివి తీసుకెళ్లడం నిషేధం.
ఒకవేళ తీసుకెళ్తే సంబంధిత బీఎల్వోలు, ఏజెంట్ల దగ్గర డిపాజిట్ చేయాలి. స్విచాఫ్ చేసి వాటిని పక్కన పడేయాలి. అంతేకాని ఆన్ లో ఉంచుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళితే నేరమే. భద్రతా సిబ్బంది పట్టుకుంటారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందే. పోలింగ్ బూత్ లోకి మొబైల్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు.
మీ వద్ద మొబైల్ ఫోన్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్ 1950 కి కాల్ చేయడం ద్వారా పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని క్యూ పద్ధతిలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుని మంచి నేతను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలుసుకోవాలి.
బాధ్యత గల పౌరుడిలా మన ఓటును మనమే వేసుకోవాలి. మనకు నచ్చిన నేతను ఎన్నుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును మనం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి అందరు ఓటు వేసి సహకరించాలి. అప్పుడే మంచి ఓటింగ్ శాతం నమోదై మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం మనకు దక్కుతుంది.