దేశ చరిత్రలో తొలిసారి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు..!
దేశంలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న నాయకుడు తనను తాను సభ నుంచి బహిష్కరించుకున్న ఘటన ఇదే తొలిసారి
By: Tupaki Desk | 4 Aug 2023 5:52 AM GMTఔను.. నిజమే.. ఇది ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే.. దేశంలో స్వాతంత్య్రం వచ్చి.. స్వీయ పరిపాలన ప్రారంభించిన తర్వాత.. ఏ పార్లమెంటు స్పీకరు కూడా .. ఎప్పుడూ ఇలా చేయలేదు. దేశంలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న నాయకుడు.. తనను తాను సభ నుంచి బహిష్కరించుకున్న ఘటన ఇదే తొలిసారి. స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది స్పీకర్లుగా పనిచేశారు. ఎస్సీల నుంచి అగ్రవర్ణాల వరకు కూడా.. అనేక మంది నాయకులు ఈ అత్యంత కీలకమైన బాధ్యతలను ఎంతో పారదర్శకంగా.. బాధ్యతగా చేపట్టారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయి.. సభ్యులను బెదరించే స్థాయికి సభలు వచ్చేశాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చోటు చేసుకున్న అల్లర్లు.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటనలు.. దేశాన్ని కుదిపేశారు. ఈ అంశాలపైనే కొన్నాళ్లుగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం.. ఆందోళనలను జరుగుతున్నాయి. వీటిని సర్దిచెప్పి.. సభలను సజావుగా జరిపించే బాధ్యత ఇటు లోక్‌సభ స్పీకర్‌పైనా.. అటు రాజ్యసభ చైర్మన్‌పైనా ఉంటాయి. అయితే.. రాజ్యాంగం ప్రసాదించిన ఈ బాధ్యతలు ఇప్పుడు కట్టుతప్పుతున్నాయనే ఆవేదన ప్రజాస్వామ్య వాదుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
సభల్లో ఆందోళన చేస్తున్న సభ్యులను నిలువరించడం.. అసరమైతే.. సభ్యులను సస్పెండ్ చేయడం.. వంటి పరిపూర్ణ అధికారాలు.. ఇరు సభల పెద్దలకుఉంది. కానీ.. ఇప్పుడు ఈ పరిస్థితి పోయింది. తామే సభల నుంచి తప్పించేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభ స్పీకర్.. బుధవారం.. లోకసభకు హాజరు కాలేదు. పోనీ.. ఆయనేమీ సెలవు పెట్టలేదు.(అవసరమైతే.. సెలవు పెట్టుకోవచ్చు) పార్లమెంటుకు వచ్చారు. కానీ.. సభ్యులు ఆందోళన చేస్తున్నంత కాలం తాను.. స్పీకర్ సీటులో కూర్చోనని.. తనను తానే బహిష్కరించుకున్నారు. ఈ ఘటన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి జరిగింది.
ఇదేమీ చిన్న విషయం కాదు. ఇది జాతీయ మీడియా, లోకల్ మీడియాల్లో పెద్దగా ప్రచారానికి నోచుకోకపోయినా.. అంతర్జాతీయ పత్రికలు .. ప్రముఖంగా ప్రచురించాయి. ''ఇండియా బికం... ఫ్రీడం లెస్'' అంటూ.. న్యూయార్క్ పత్రిక కథనం రాసిందంటే.. ఎంత పెద్ద విషయమో అర్థమవుతుంది. ఇక, రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి కూడా.. తాను ప్రధానిని సభకు రావాలని ఆదేశించలేనని తన అచేతనాన్ని ప్రకటించేశారు. నిజానికి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తికి సభలో ప్రతిపక్షం, అధికార పక్షంలో ఉన్న సభ్యులు అందరూ ఒకే విధం. కానీ.. చైర్మన్ ఈ ప్రకటన చేసి.. సభను వాయిదా వేశారు. ఈ విషయాన్ని కూడా అంతర్జాతీయ పత్రికలు ఘోరంగా విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.