Begin typing your search above and press return to search.

స్పీకర్ గా పురంధేశ్వరి ?

పురంధేశ్వరిని కొత్త లోక్ సభలో స్పీకర్ గా ఎన్నుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. తాజాగా ఆమె రాజమండ్రి నుంచి గెలిచారు

By:  Tupaki Desk   |   9 Jun 2024 8:49 AM GMT
స్పీకర్ గా పురంధేశ్వరి ?
X

కేంద్రంలో నరేంద్ర మోడీ సారధ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతో ప్రమాణం చేస్తారు అని భావిస్తున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరిని అత్యంత ముఖ్య హోదాలోకి తీసుకోవడానికి బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు అని అంటున్నారు.

దాంతోనే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రధానమంత్రి ఆఫీసు నుంచి ఫోన్ రాలేదని అంటున్నారు ఏపీలో బీజేపీ తరఫున ముగ్గురు ఎంపీలుగా గెలిచారు. వారిలో పురంధేశ్వరికి గ్యారంటీగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇస్తోంది.

పురంధేశ్వరిని కొత్త లోక్ సభలో స్పీకర్ గా ఎన్నుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. తాజాగా ఆమె రాజమండ్రి నుంచి గెలిచారు. ఈ గెలుపుతో ఆమె మూడు సార్లు పార్లమెంట్ కి ఎన్నిక అయినట్లు అవుతుంది. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమెకు ఆ విధంగా పార్లమెంటరీ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు.

దాంతో ఆమెను స్పీకర్ గా ఎన్నుకోవాలని బీజేపీ తలపోస్తోంది. మరో వైపు టీడీపీ ఈ కీలకమైన పోస్ట్ ని కోరింది. అలాగే జేడీయూ కూడా కోరుతోంది. దాంతో ఈ పోస్టుని బీజేపీ తానే అట్టిబెట్టుకోవాలని చూస్తోంది. అదే విధంగా పురంధేశ్వరికి ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా టీడీపీకి కూడా పెద్దగా ఇబ్బంది రాదు అని అంటున్నారు.

పురంధేశ్వరి స్పీకర్ గా ఉంటే టీడీపీ సభ్యుల ఫిరాయింపుల విషయంలో గట్టిగానే ఉండే చాన్స్ ఉంది. దాంతో మధ్యమార్గంగానే టీడీపీ బీజేపీల మధ్య ఈ అవగాహన వచ్చినట్లుగా చెబుతున్నారు. జేడీయూకి ఆ విధంగా స్పీకర్ పదవి ఇవ్వకుండా లౌక్యం ప్రదర్శించారు అని అంటున్నారు.

ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున మొదటి సారి గెలిచిన శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కుతోంది. ఆయన నర్సాపురం నుంచి గెలిచారు. పాతికేళ్ళుగా బీజేపీలో ఆయన పనిచేస్తున్నారు. ఆయనకు ఆరెస్సెస్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు.

బీజేపీకి చెందిన అసలైన నేతకు ఆ విధంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతోంది అని చెప్పాలి. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖను అందుకోవాలని చూసిన పురంధేశ్వరికి రాజ్యాంగ పదవి లభించడం గొప్ప విషయమే అంటున్నారు. నరేంద్ర మోడీ తొలిసారిగా 2014లో ప్రధాని అయ్యాక అయిదేళ్ల పాటు స్పీకర్ గా సుమిత్రా మహాజన్ అనే మహిళా నాయకురాలిని స్పీకర్ గా చేశారు. ఇపుడు మరోసారి మహిళలకే ఈ అవకాశం బీజేపీ ఇస్తోంది.

ఇక పురంధేశ్వరికి ఈ కీలకమైన పదవి అంటే అన్న గారి కుమార్తెగా ఆమెకు గౌరవం అలాగే అన్న గారి అభిమానులకు కూడా ఇది గర్వకారణం అంటున్నారు. ఆ విధంగా ఏపీలో తన గ్రాఫ్ పెంచుకోవడానికి బీజేపీ ఈ రకమైన వ్యూహం వేసిందని కూడా అంటున్నారు. మరో వైపు స్పీకర్ గా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులైతే ఏపీలో బీజేపీ కి కొత్త ప్రెసిడెంట్ ని ఎంపిక చేస్తారు అని అంటున్నారు.