కుబేరుల కాలనీ, సెలబ్రెటీల స్ట్రిట్ కి దోపిడీ దొంగల సమస్య... దొరికింది వీరే!
ఈ క్రమంలో తాజాగా 20 మంది లూటర్లను అరెస్టు చేసినట్లు అక్కడి షరీఫ్ డిపార్ట్ మెంట్ ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Jan 2025 10:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ను చుట్టిముట్టిన కార్చిచ్చు మరింతగా వ్యాపిస్తుంది. ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోనీ తాకిందని అంటున్నారు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఈ కుబేరుల కాలనీకి, సెలబ్రెటీల స్ట్రిట్ కి మరో సరికొత్త ఘోరమైన సమస్య వచ్చిందని చెబుతున్నారు.
లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. ఈ కార్చిచ్చు కారణంగా ఐదుగురు మరణించారని చెబుతున్నారు. పసడెనాలో సుమారు 500 సంపన్నుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని అంటున్నారు. కట్టుబట్టలతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నవారి సంఖ్య 1.3 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ ఇళ్లను దోపిడీ దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
అవును... ఓ పక్క కార్చిచ్చు కమ్మేస్తుండగా.. కట్టుబట్టలతో ఇళ్లను ఖాళీచేసి, అందులోని విలువైన వస్తువులను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు లక్షలాది మంది ప్రజలు. దీంతో.. సందట్లో సడేమియాలాగా దోపిడీ దొంగలు పని కానిచ్చేస్తున్నారు. సంపన్నులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిన ఇళ్లల్లోని విలువైన వస్తువులను కాజేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా 20 మంది లూటర్లను అరెస్టు చేసినట్లు అక్కడి షరీఫ్ డిపార్ట్ మెంట్ ప్రకటించారు. సంక్షోభ సమయంలో ఇలా దోపిడీకి పాల్పడుతున్నవారు సిగ్గుపడాలని.. వదిలేసిన ఆస్తుల జోలికి ఎవరైనా వస్తే తగిన పరిణమాలూ అనుభవిస్తారని కౌంటీ సూపర్ వైజర్ కాథరిన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గస్తీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోపక్క... పసిఫిక్ పాలిసాడ్స్ ఏరియాను ఈ కార్చిచ్చు పూర్తిగా దగ్దం చేసిందని.. ఒక్క పాలిసాడ్స్ లోనే సుమారు 5,300 నిర్మాణాలు.. మొత్తంగా 9,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయని చెబుతున్నారు. ఇక.. పాలిసాడ్స్ లో సుమారు 20 వేల ఎకరాలతోపాటు ఈటోన్ ఫైర్ 13,600 ఎకరాలు.. కెన్నత్ ఫైర్ 791 ఎకరాలు.. హురస్ట్ ఫైర్ 855 ఎకరాలు దహనమైనట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ నష్టం చేసిన కార్చిచ్చు అని చెబుతుండగా.. ఆక్యూవెదార్ తాజా అంచనాల ప్రకారం ఈ కార్చిచ్చు కలిగించిన నష్టం సుమారు 150 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్లు) గా ఉంటుందని అంచనా కాగా.. అమెరికాలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు ఇక్కడ ఉండటమే ఈ భారీ నష్టానికి కారణం అని చెబుతున్నారు.