దొంగలకు రూ.450 కోట్ల బంపర్ లాటరీ... చిక్కేమిటంటే..?
ఊహించని స్థాయిలో అదృష్టం తలుపు తట్టడం అంటే భారీ స్థాయిలో లాటరీ తగలడం అని చాలా మంది అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఫ్రాన్స్ లో ఇద్దరు వ్యక్తులకు 5 లక్షల యూరోల లాటరీ తగిలింది.
By: Tupaki Desk | 23 Feb 2025 2:30 PM GMTఅదృష్టం తలుపు తట్టడం అంత ఈజీ కాదు.. 700 కోట్ల పైచిలుకు ప్రపంచ జనాభాలో అతి కొద్ది మందికి మాత్రమే అది జరుగుతుంటుంది. చాలా మందికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే... ఊహించని స్థాయిలో లక్ష్మీదేవి కటాక్షం వారికి తగులుతుంటుంది. అలాంటి కటాక్షమే తాజాగా ఫ్రాన్స్ లో ఓ వ్యక్తిని వరించింది. అయితే... అది సగమే తలుపు తట్టుతుందని అంటున్నారు.
అవును... ఊహించని స్థాయిలో అదృష్టం తలుపు తట్టడం అంటే భారీ స్థాయిలో లాటరీ తగలడం అని చాలా మంది అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఫ్రాన్స్ లో ఇద్దరు వ్యక్తులకు 5 లక్షల యూరోల లాటరీ తగిలింది. అంటే... భారత కరెన్సీలో సుమారు రూ.450 కోట్లు అన్నమాట! దీంతో వాళ్లిద్దరూ ఎగిరి గంతేసే లోపు.. ఓ విషయం గుర్తొచ్చి ఆగిపోయారట.
కారణం.. ఆ లాటరీ టిక్కెట్ ను దొంగిలించిన ఏటీఎం కార్డుతో కొన్నారంట. దీంతో వీరిద్దరూ ఒక్కసారిగా ఢీలా పడిపోయినట్లు చెబుతున్నారు. ఓ పక్క లాటరీ నిర్వహాకులు విజేత కోసం వెయిట్ చేస్తుంటే.. మరోపక్క లాటరీ సొమ్ము కోసం వెళ్తే ఎక్కడ దొరికిపోతామోననే భయం ఆ దొంగను వెంటాడుతోందని అంటున్నారు.
అయినప్పటికీ అదృష్టం వారిని వదిలేలా కనిపించలేదని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఆ కార్డు అసలు ఓనరేమో.. తన ఏటీఎం కార్డుతో పాటు లాటరీ టిక్కెట్ తో వస్తే జాక్ పాట్ సొమ్మును సమానంగా పంచుకుందామని.. అప్పుడు పర్సు పోయిందన్న కేసును ఉపసంహరించుకుంటానని ఓ ఆఫర్ ప్రకటించాడంట.
వాస్తవానికి.. దొంగలు లాటరీ టిక్కెట్ కొనడానికి ఉపయోగించిన కార్డు జీన్ డేవిడ్ అనే వ్యక్తిది. అతడు ఇటీవల తన బ్యాగు, అందులోని పర్సు పోయిందని.. పర్సులో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోపక్క తన కార్డులను బ్లాక్ చేయాలని బ్యాంకువారినీ సంప్రదించాడు. అయితే.. అప్పటికే ఆ కార్డులను వినియోగించినట్లు తేలిందంట.
ఇందులో భాగంగా... జీన్ డేవిడ్ కార్డును చివరిగా ఓ షాపులో లాటరీ టిక్కెట్ కొనుగోలుకు ఇద్దరు వ్యక్తులు ఉపయోగించారని పోలీసుల దర్యాప్తులో తేలిందంట. ఈ సమయంలో పోలీసులు తమ కోసం గాలిస్తున్నందువల్ల.. లాటరీ సొమ్ము కోసం వేళ్తే దొరికిపోతామని దొంగలు భయపడుతున్నారట. ఈ సమయంలో జీన్ డేవిడ్ నుంచి ఆఫర్ వచ్చిందంట.
ఓ పక్కఏమో లాటరీ టిక్కెట్ గడుపు సమీపిస్తుందంట.. మరోపక్కేమో తమ కోసం పోలీసులు వెతుకుతున్నారన్న టెన్షన్ లో లాటరీ తగిలిన ఇద్దరు దొంగల టెన్షన్.. మరోపక్క తనకు సగం సొమ్ము ఇస్తే లాటరీ వెనక్కి తీసుకుంటానని ఆఫర్.. ఈ సమయంలో దొంగలు ఇద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.