వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలు తొలగింపు!
అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలను జీ.హెచ్.ఎం.సీ అధికారులు తొలగించారు.
By: Tupaki Desk | 15 Jun 2024 9:41 AM GMTహైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ సెక్యూరిటీ షెడ్లను అక్రమంగా నిర్మించారంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. రహదారికి అడ్డంగా ఉన్నాయనే ఫిర్యాదుతోనే మూడు షెడ్లను కూల్చేసినట్లు జీ.హెచ్.ఎం.సీ. అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.
అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలను జీ.హెచ్.ఎం.సీ అధికారులు తొలగించారు. వాస్తవానికి ఇవి అప్పట్లో పోలీస్ సెక్యూరిటీ కోసం నిర్మించిన షెడ్లుగా చెబుతున్నారు. అయితే ఇవి అక్రమ నిర్మాణాలు అని.. వీటిని తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి.. జీ.హెచ్.ఎం.సీ, పోలీసులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే శనివారం నాడు చర్యలకు ఉపక్రమించారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత కోసం ఈ ఏర్పాట్లు అవసరమని ఆయన మద్దతు దారులు వాదిస్తున్నారని తెలుస్తుంది.
అయితే... ఇది ప్రజల ఆస్తి అని, ఈ రహదారిగుండా వెళ్లడానికి ప్రజలకు మెరుగైన ప్రవేశం కల్పించడం కోసమే ఈ చర్యలు చేపట్టారని స్థానికులు, అధికారులు చెబుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... గతంలో జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా ఈ లోటస్ పాండ్ ను ఎవరూ టచ్ చేయకపోయినా... తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి సర్కార్ టచ్ చేయడం ఆసక్తిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!