Begin typing your search above and press return to search.

15 రోజుల్లో లవ్ మ్యారేజ్.. అంతలోనే ఆత్మహత్య.. అసలేం జరిగింది?

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిహార్ కు చెందిన 34 ఏళ్ల అదితి భరద్వాజ్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 8:30 AM GMT
15 రోజుల్లో లవ్ మ్యారేజ్.. అంతలోనే ఆత్మహత్య.. అసలేం జరిగింది?
X

ఒక షాకింగ్ సూసైడ్ హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. మరో పదిహేను రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన సదరు ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవటానికి వెనుక కారణాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే.. ఆమె ఆత్మహత్య వెనుక అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిహార్ కు చెందిన 34 ఏళ్ల అదితి భరద్వాజ్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరానికి వచ్చి స్థిరపడిన ఆమెకు గతంలో పెళ్లైంది. అయితే.. సదరు వ్యక్తితో పొసగక విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో ఆమె తన నివాసాన్ని మణికొండకు మార్చుకుననారు. ఇదిలా ఉంటే.. తనతో పాటు పని చేసే చింతల్ మెంట్ కు చెందిన మహ్మద్ అలీతో ఆమె దగ్గరయ్యారు.

అతడితో కలిసి సహజీవనం చేస్తున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీహోమ్స్ కాలనీలోని ఒక అపార్టుమెంట్ లో ప్లాట్ ను తీసుకొని ఉంటున్నారు. అందులో అదితి ఉంటోంది. వీరిద్దరూ ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. మహ్మద్ అలీకి ఇంతకు ముందే పెళ్లి అయినట్లుగా చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం ఆదితి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఆసుపత్రికి వెళ్లగా.. ఆమె ప్రెగ్నెంట్ అన్న విసయాన్ని వైద్యులు చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్ చేసిన ఆమె.. తాను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. అతడు ప్లాట్ కు వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే.. అతడు అత్తాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సహజీవనం చేస్తున్న మహ్మద్ అలీ వేరే చోట ఎందుకు ఉన్నాడు? అతడి తీరుతోనే ఆమె మనస్తాపానికి గురైందా? పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకున్నప్పుడు.. గర్భం దాల్చటం తీవ్రమైన ఒత్తిడికి ఎందుకు కారణమైంది? లాంటి పలు సందేహాలకు పోలీసుల విచారణలో సమాధానాలు దొరకాల్సి ఉంది.