Begin typing your search above and press return to search.

లక్కీ భాస్కర్ ఎఫెక్ట్.. పిల్లలు మిస్సింగ్?

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   11 Dec 2024 4:30 AM GMT
లక్కీ భాస్కర్ ఎఫెక్ట్.. పిల్లలు మిస్సింగ్?
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్యాంకింగ్ సెక్టార్ కథాంశంతో రియల్ గా జరిగిన సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని వెంకీ అట్లూరి ఈ కథని తెరపై ఆవిష్కరించారు. ఒక సామాన్య బ్యాంక్ ఉద్యోగి నుంచి 100 కోట్లకి అధిపతి అయిన వాడిగా దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఉంటుంది. సామాన్య ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యే విధంగా ఈ కథని వెంకీ అట్లూరి చెప్పారు.

అందుకే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ మూవీ మరో విధంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నంలో హాస్టల్ లో ఉండి 9వ తరగతి చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీనిపై ఇప్పటికే హాస్టల్ వార్డెన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకి కూడా విషయం తెలియజేశారు. అయితే వీరు పారిపోవడానికి ‘లక్కీ భాస్కర్’ మూవీ ఎలా కారణం అయ్యిందనే ఆసక్తి అందరికి ఉంటుంది.

ఈ సినిమా చూసిన తర్వాత మూవీలో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కి ఆ విద్యార్థులు బాగా కనెక్ట్ అయిపోయారంట. దాంతో ఎలా అయిన ఆ సినిమా తరహాలోనే బాగా డబ్బు సంపాదించి కార్లు కొన్న తర్వాత తిరిగొస్తామని హాస్టల్ నుంచి తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హాస్టల్ లో ఫ్రెండ్స్ లో ఎస్కేప్ అయిన విద్యార్థులు చెప్పారంట. వారు హాస్టల్ నుంచి తప్పించుకొని బయటకి వచ్చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని రకాలుగా వారిని వెతికే పనిలో పడ్డారు. మరోవైపు తమ పిల్లల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూ ద్వారా ఇప్పటికి కూడా సినిమాల ప్రభావం ప్రజల మీద ఏదో ఒక రూపంలో పడుతోందని అర్ధమవుతోంది. సినిమాలలో హీరో పాత్రలని కొంతమంది యువత టీనేజ్ లో వారి నిజజీవితానికి అన్వయించుకుంటారు.

వారి తరహాలోనే చేయాలని అనుకుంటారు. రియల్ లైఫ్ స్టోరీస్ బేస్ చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. కొన్ని రియల్ లైఫ్ సంఘటనల వెనుక సినిమాల ప్రభావం ఉంటుంది. ‘లక్కీ భాస్కర్’ మూవీ ఇప్పుడు నలుగురు విద్యార్థులు పారిపోయేలా చేసింది. అయితే వారు హాస్టల్ నుంచి పారిపోవడం వెనుక ఈ సినిమా ప్రభావమేనా, ఇంకేదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.