Begin typing your search above and press return to search.

యూదులపై జాతి వివక్ష... లుఫాన్సా కు అమెరికా భారీ ఫైన్!

ఈ లోకంలో చాలామంది ఎవరికి వారే మిగిలినవారికంటే చాలా ఎక్కువ వారిమని భావిస్తూ.. మిగిలినవారిని తక్కువగా చూస్తూ

By:  Tupaki Desk   |   16 Oct 2024 7:37 AM GMT
యూదులపై జాతి వివక్ష... లుఫాన్సా కు అమెరికా భారీ ఫైన్!
X

ఈ లోకంలో చాలామంది ఎవరికి వారే మిగిలినవారికంటే చాలా ఎక్కువ వారిమని భావిస్తూ.. మిగిలినవారిని తక్కువగా చూస్తూ.. జాతి వివక్ష పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటారు.. ఇది దిగజారుడు తనానికి, వెనుకబాటుతనానికి నిదర్శనం అని గుర్తించలేకపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కూడా ఇలానే ప్రవర్తించింది!

అవును... జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ యూదు ప్రయాణికుల విషయంలో తేడాగా వ్యవహరించింది! దీంతో దీన్ని జాతి వివక్షగా భావించినవారు ఫిర్యాదు చేశారు. దీంతో... సదరు ఎయిర్ లైన్స్ కు అమెరికా అధికారులు భారీ ఫైన్ విధించారు. ఈ చర్య జాతివివక్ష ఆలోచనలు ఉన్నవారికి, దాన్ని ఆచరణలో పెట్టేవారికి కనువిప్పు కలిగించాలని పలువురు కోరుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే... 2022లో 128 యూదు ప్రయాణికులను జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయి ర్ లైన్స్ విమాన సిబ్బంది ఎక్కకుండా అడ్డుకున్నారు. అప్పట్లో కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇది అమెరికాలోని ఫ్రాంక్ ఫర్ట్ నుంచి జర్మనీకి వెళ్తున్న విమానం. దీనిలోని ఎవరో కొంతమంది యూదు ప్రయాణికులు నిబంధనలు పాటించలేదంట.

దీనిపై ఆ విమాన కెప్టెన్.. సదరు విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. మొత్తం 128 మంది యూదులను బోర్డింగ్ కు అనుమతించలేదు. ఈ సమయంలో వారి దుస్తులు, జాకెట్లు, నల్లటి టోపీలు చూసి మొత్తం ఒకటే గ్రూపు అని భావించారట. అయితే... వాస్తవానికి వారిలో ఒకరితో ఒకరికి కనీసం పరిచయం కూడా లేనివారు ఉన్నారు.

కేవలం ఒకటే రకమైన వస్త్రదారణ వల్ల విమానయాన సిబ్బంది ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ చర్యను జాతి వివక్షగా భావిస్తూ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ (డీవోటీ)కు ఫిర్యాదులు అందాయి. వీరిలో సుమారు 40 మంది ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీన్ని అమెరికా సీరియస్ గా తీసుకుంది.

వెంటనే దర్యాప్తు మొదలుపెట్టింది. వారి వేషధారణ యూదుల వలే కనిపించడంతోనే లుఫ్తాన్సా వారి బోర్డింగ్ ను నిరాకరించిందనే విషయం అమెరికా అధికారులు గుర్తించారంట. దీంతో... లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు నాలుగు మిలియన్ డాలర్ల ఫైన్ విధించారు డీవోటీ అధికారులు.