Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో లూలూ మాల్.. ఎంత పెద్దది.. ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే?

గడిచిన కొంత కాలంగా హైదరాబాదీయులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లూలూ మాల్ ఓపెన్ కానుంది.

By:  Tupaki Desk   |   24 Sep 2023 2:30 PM GMT
హైదరాబాద్ లో లూలూ మాల్.. ఎంత పెద్దది.. ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే?
X

గడిచిన కొంత కాలంగా హైదరాబాదీయులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లూలూ మాల్ ఓపెన్ కానుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. విదేశాల్లోనూ ఫేమస్ మాల్ కు పర్యాయపదంగా లూలూ మాల్ కు పేరుంది. ఈ సంస్థ హైదరాబాద్ లో భారీ మాల్ ఓపెన్ కు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. కొవిడ్ కు ముందు వరకు జేఎన్టీయూ రోడ్డులోని మంజీరా మాల్ ను లూలు మాల్ టేకప్ చేసి.. దాన్ని లూలూ మాల్ గా డెవలప్ చేయటం తెలిసిందే.

ఆగస్టు 15న గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని చెప్పినా.. అదేమీ జరగకపోవటం తెలిసిందే. తాజాగా ఈ మాల్ ప్రారంభం మీద లేటెస్టు అప్డేట్ వచ్చేసింది. రూ.300 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థ దేశంలోని అతి పెద్ద షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతోంది. మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ పుణ్యమా అని మొత్తం 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో మొత్తం 200 షాపులు ఉండనున్నాయి. అంతేకాదు 1400 సీట్ల కెపాసిటీ ఉన్న ఐదు స్క్రీన్లతో కూడిన మల్టీఫ్లెక్సు (సినీ పోలీస్) ఉంది.

ఏకకాలంలో 3 వేలకు పైగా కార్లు పార్కు చేసే సౌకర్యం ఉన్న ఈ మాల్ ను ఈ నెల 26న ప్రారంభం కానుంది. దీన్ని ఓపెన్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రానున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ సంస్థ రూ.3500 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారుతో పాటు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మినీ మాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మహానగరానికి మరో భారీ మాల్ లూలు పుణ్యమా అని ఏర్పాటు కానుంది. మంగళవారం ప్రారంభయ్యే ఈ మాల్ కారణంగా జేఎన్టీయూ - హైటెక్ సిటీ రోడ్డు మరింత రద్దీగా మారనుందని చెప్పక తప్పదు.