Begin typing your search above and press return to search.

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా... పూర్వాశ్రమానికేనా?

ఈ మేరకు తన రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. అయితే... రాజీనామా అనంతరం గిరి పూర్వాశ్రమానికే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 July 2024 1:10 PM GMT
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా... పూర్వాశ్రమానికేనా?
X

ఏపీలో ఘోర పరాజయం అనంతరం వైసీపీకి ఎదురుదెబ్బలు తగులూనే ఉన్నాయి. ఇప్పటికే విశాఖ కార్పొరేటర్లు గంత గుప్పగా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోగా... తాజాగా మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. అయితే... రాజీనామా అనంతరం గిరి పూర్వాశ్రమానికే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి క్రమంగా వలసలు మొదలవుతున్నట్లున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కిందిస్థాయిలో కౌన్సిలర్లు పార్టీని వీడగా.. ఇప్పుడు పైస్థాయి నేతలూ జగన్ కు ఝులక్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి రాజీనామా చేశారు.

2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున గెలిచారు మద్దాల గిరి. ఆ తర్వాత అధికార పార్టీలోనే ఉండాలని భావించారో ఏమో కానీ... వైసీపీలో చేరిపోయారు. గుంటూరు సిటీ వైసీపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం టిక్కెట్ దక్కకపోవడంతో నిరాశపడినట్లు కనిపించినా పార్టీలోనే కంటిన్యూ అయ్యారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో గిరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను నగర అధ్యక్ష, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు మద్దాల గిరి కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.

ఆయన భవిష్యత్ కార్యచరణపై ఎంతో ఆసక్తిగా కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో గిరి ఉన్నట్లు తెలుస్తోంది.