Begin typing your search above and press return to search.

సెబీ చీఫ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు.. షాక్ లో మాధబి..

సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ చిన్న షాక్ ఇచ్చింది. అక్టోబర్ 24న ఆమె కమిటీ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 1:19 PM GMT
సెబీ చీఫ్ కు  పార్లమెంటరీ కమిటీ సమన్లు.. షాక్ లో మాధబి..
X

సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ చిన్న షాక్ ఇచ్చింది. అక్టోబర్ 24న ఆమె కమిటీ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. అదాని వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించడానికి నిర్ణయించుకున్న పీఏసీ సమన్లు చారీ చేసినట్లు టాక్.

మాధబితో పాటుగా ట్రాయ్ ఛైర్పర్సన్ అనిల్ కుమార్కి కూడా సమన్లు జారీ చేశారు. ఇక వీరితో పాటుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులను కూడా కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అయితే పార్లమెంటరీ కమిటీ సమావేశానికి మాధబి పురి బచ్,అనిల్ కుమార్ పర్సనల్గా హాజరయ్యే అవకాశం లేదని.. వారి తరఫున సీనియర్ అధికారులు సమావేశానికి వస్తా రని సూచనప్రాయంగా కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం మాధబి చుట్టూ వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

అతని విదేశీ సంస్థల నుంచి మాధబికి ఆదాయాలు వస్తున్నట్టు అమెరికన్ రీసర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ నివేదికపై అప్పట్లో ప్రతిపక్షాలు నిరసనలు కూడా చేపట్టాయి. ఈ నివేదికపై దర్యాప్తు చేయాలని.. మాధబి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టిన పార్లమెంట్ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసింది.

గత కొన్ని వారాలుగా మాధబి పలు వివాదాలలో చిక్కుకుంటూ వస్తున్నారు. మొన్నటి వరకు ఒక అదాని షేర్ల వ్యవహారం మాత్రమే ఉండేది.. అయితే ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయిస్ జీతభత్యాల విషయం లో కూడా ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరొకసారి ఆమె పేరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. బచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ కార్యక్రమంలో జరుగుతున్న పని సంస్కృతిపై సెబీ అధికారులు ఫిర్యాదు ఇచ్చారు. వరుసగా వివాదాలు తలెత్తడంతో ఈనెల 24న కాంగ్రెస్,హిండెన్‌బర్గ్‌పై చేసిన ఆరోపణల పై విచారణ జరుగుతుంది.