Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లలేదా?

అయితే... అనూహ్యంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం మంగళవారం ఏపీ శాసనమండలిలో ప్రత్యక్షమయ్యారు.

By:  Tupaki Desk   |   24 July 2024 7:02 AM GMT
ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లలేదా?
X

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని.. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయంటు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమానికి ఇద్దరు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారని తెలుస్తోంది!

అవును... ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ హస్తిన వేదికగా ఆత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే... నేటి ఢిల్లీ ధర్నా! అలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మంగళవారమే హస్తినకు చేరుకున్నారు!

అయితే... అనూహ్యంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం మంగళవారం ఏపీ శాసనమండలిలో ప్రత్యక్షమయ్యారు. ఇందులో భాగంగా... తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర.. ఇద్దరూ మంగళవారం మండలికి వచ్చారు! ఢిల్లీకి వెళ్లాల్సిన వీరిద్దరూ ఇలా మండలికి హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. మరి వీరిద్దరూ బుధవారం అయినా హస్తినకు వెళ్లారా లేదా అనేది తెలియాల్సి ఉంది!

అంతా హస్తిన భాట పట్టగా.. మంగళవారం ఏపీలో వైసీపీ నేతలు ఎవరూ కనిపించలేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్న నేపథ్యంలో... వీరిద్దరూ మంగళవారం మండలిలో కనిపించడం.. బుధవారం అయినా ఢిల్లీకికి వెళ్లారా లేదా అనే విషయం ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో... వీరిద్దరూ జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా?.. సైకిల్ ఎక్కబోతున్నారా?.. అనే చర్చ మొదలైంది!

మరోవైపు... ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం ప్రారంభానికి ముందు జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాలనలో ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ.. లోకేష్ మాత్రం రెడ్ బుక్ అంటూ తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.