Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత కీలక స్టెప్!

వాటికి మాధవీలత నుంచి సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2025 9:12 AM GMT
జేసీ ప్రభాకర్  రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత కీలక స్టెప్!
X

డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి మాధవీలత నుంచి సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో... తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని.. క్షమాపణలు కొరుతున్నానని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఆవేశంలోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని.. కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై "మా"కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు మాధవీలత.

అవును... మాధవీలత పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాకు ఫిర్యాదు చేశారు మాధవీలత. తన గురించి జేసీ చేసిన వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ స్పందించలేదని.. అందువల్లే ఈ వ్యవహారంపై తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు!

ఈ సందర్భంగా స్పందించిన ఆమె... ప్రభాకర్ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని.. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైంది కాదని.. ఆ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెబితే సరిపోదని.. ప్రభాకర్ రెడ్డిపై న్యాయపోరాటం చేస్తానని మాధవీలత తెలిపారు. ఇదే సమయంలో.. తనపై చేసిన వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ ఖండించలేదని.. అందుకే ఈ ఫిర్యాదు అని తెలిపారు.