Begin typing your search above and press return to search.

"అనితక్కా.. ఏంది మీ తిక్క?"... బీజేపీ నాయకురాలు ఫైర్!

ఈ సమయంలో నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 6:03 AM GMT
అనితక్కా.. ఏంది మీ తిక్క?... బీజేపీ నాయకురాలు ఫైర్!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ పండగ నేపథ్యంలో మండపాలు, విగ్రహాల ఏర్పాటు అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు.

అవును... వినాయక చవితి నేపథ్యంలో మండపాలు, విగ్రహాలు ఏర్పాటు, అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా... మైక్ పర్మిషన్ కు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు హైట్ ను బట్టి చలాన్ కట్టాలి అంటూ హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ సమయంలో స్పందించిన మాధవీలత... "అనితక్కా... ఏమిటి మీ తిక్క"? అంటూ కాస్త ఘాటుగానే తగులుకున్నారు.

ఇందులో భాగంగా... అందరికీ హిందువుల పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని అని మొదలుపెట్టిన మాధవీలత... మండపాల వద్ద అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధంగా ఉంటారంటూ నిప్పులు కక్కారు! “మిగిలిన మతస్థుల పండగలకు మాత్రం ఎలాంటి కండిషన్సూ పెట్టరు.. ఫస్ట్ వాళ్లకు పెట్టి అప్పుడు హిందువులకు పెట్టండి” అంటూ తనదైనశైలిలో స్పందించారు.

ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వ్యగ్యాంస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్యాచార ఘటనను లేవనెత్తారు. ఈ మేరకు ఇన్ స్టా లో వీడియో విడుదల చేసిన మాధవీలత... ఏపీలో అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వం అయినప్పటికీ తనకు రాజకీయాలకంటే ధర్మం, హిందూ ధర్మం ముఖ్యమని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... "అనితక్కా... ఏంది మీ తిక్క?" అని ప్రశ్నించిన ఆమె... "ఔనక్కా.. మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది కేసు..? ఉయ్యాలలో ఉన్న బిడ్డను ముసలోడు మానభంగం చేశాడు.. ఆ ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇప్పుడు మేము ఇచ్చే భిక్షతో లాయర్ని పెడతారా? అంటూ హోంమంత్రి అనితపై పరోక్షంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

"అడుక్కుంటే భిక్ష వేయడానికి ఏపీ హిందూ బంధువులు, వినాయక భక్తులు సిద్ధంగా ఉంటారు.. అసలే మా వినాయకుడికి ఆకలి ఎక్కువ.. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు వేస్తారు.. ఏముంది? అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి.. మా వినాయకుడి మండపాలకు, విగ్రహం ఎత్తుకు డబ్బులు ఎందుకు అని ప్రశ్నించారు మాధవీలత!

కాగా... గణేష్ మండపాలకు మైక్ అనుమతికి, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత ఇటీవల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మైక్ అనుమతికి రోజుకి రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులు ఉంటే రూ.350, ఆరు అడుగులకంటే ఎక్కువ ఎత్తు ఉంటే రూ.700 చలానా కట్టాలని ఆమె అన్నారు.