కలిసే ఉన్నాం.. గుళ్లకు వెళుతుంటాం.. మాధురి వెర్షన్ ఇది
శుక్రవారం శ్రీకాకుళానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు తనకు మధ్యనున్న బంధం గురించి.. అనుబంధం గురించి ఆమె మాట్లాడారు.
By: Tupaki Desk | 10 Aug 2024 3:48 AM GMTవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వైవాహిక జీవితానికి సంబంధించిన వివాదం రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తన భర్త తనను తన పిల్లల్ని మోసం చేస్తున్నారని.. వైసీపీ మహిళా నేత మాధురితో కలిసి ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయటం.. తనను ఇంట్లోకి కూడా రానివ్వటంలేదంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే.
పిల్లల్ని తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందుకు వచ్చిన దువ్వాడ వాణిని.. ఇంటి లోపలకు రానివ్వకపోవటం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల గురించి తెలిసిందే. తమ కుటుంబ అంశాల గురించి సీఎంగా జగన్ ఉన్న సమయంలోనే వివరించామని.. అయినా ఫలితం లేకుండా పోయినట్లుగా దువ్వాడ వాణి వ్యాఖ్యానిస్తున్నారు. తమ కుమార్తెలు హైందవి.. నవీనలు ఇద్దరు అక్కవరం సమీపంలోని దువ్వాడ ఇంటికి వెళ్లగా.. బయటే ఉంచేశారని.. లోపలకు రానివ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ మొత్తం వివాదానికి సంబంధించి సెంటర్ పాయింట్ గా ఉన్న టెక్కలి వైసీపీ నేత మాధురి తాజాగా సీన్లోకి వచ్చారు. శుక్రవారం శ్రీకాకుళానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు తనకు మధ్యనున్న బంధం గురించి.. అనుబంధం గురించి ఆమె మాట్లాడారు. తమ మధ్య ఉన్నది స్నేహ బంధమేనని చెప్పిన ఆమె.. ఇప్పుడైతే ఇదే.. భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదన్నారు. మరో సందర్భంలో కలిసే ఉంటున్నామని.. కలిసే గుళ్లకు వెళుతుంటామన్న మాధురి.. అడల్టరీ తప్పు లేదని సుప్రీంకోర్టే చెప్పిందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన సందర్భంగా మాధురి చేసిన వ్యాఖ్యల్ని ఆమె మాటల్లోనే..
- దువ్వాడ వాణి చేసిన ఆరోపణలన్ని అసత్యాలు. నిరాధారమైనవి. ఆమె చెప్పినవేమీ నిజాలు కావు. ఆ విషయాన్ని చెప్పేందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. ఆమె చెప్పిన ఏ విషయంలోనూ వాస్తవం లేదు. ఆవిడ రాజకీయ లబ్థి కోసం నన్ను పావులా వాడుకుంది. నన్ను బలిపశువును చేసింది. వాళ్లకు వాళ్లకు సమస్యలు ఉంటే.. ఆమె.. ఆమె భర్త.. పిల్లలు కూర్చొని తేల్చుకోమనండి. నన్ను అందులోకి లాగొద్దు. నన్ను సొసైటీలో సరిగా బతకనివ్వాలి. నన్ను బయటకు ఈడ్చి నా పరువు తీయొద్దు.
- వివాహేతర సంబంధం.. ఇంకేమీ కాదు. ఆవిడ చేసిన ఆరోపణల వల్ల సొసైటీలో అందరు మాట్లాడుకోవటం వల్ల నేను నా కుటుంబానికి దూరమయ్యాను. నాకు అత్తింటి వారి సపోర్టు లేక నేను ఒంటరిని అయిపోయినప్పుడు.. మీకంటూ ఒక స్నేహితుడిగా.. ఒక తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. నా జీవితాన్ని నేను లీడ్ చేసుకుంటూ వస్తున్నాను.
- దువ్వాడ శ్రీను.. నేను ఒకే ఇంట్లో ఉంటున్నానా అంటే.. వెళ్లి వస్తుంటాను. ప్రజెంట్ అయితే కలిసి లేము. ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలీదు. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు ఇంటికి వచ్చే టైంలో నేను లేను. అప్పుడు వైజాగ్ లో ఉన్నాను. న్యూస్ చూసి నేను ఇప్పుడు ఇక్కడకు వచ్చాను. అవును.. నేను ఇంటికి వస్తుంటాను. అప్పుడప్పుడు మీరూ వస్తుంటారు కదా (తాను మాట్లాడుతున్న మీడియా ప్రతినిధిని ఉద్దేశించి) అలానే నేను వచ్చి పోతుంటాను.
- ఈ రిలేషన్ ను ఫ్రెండ్ షిప్ అనుకోండి. సహజీవనం చేయటానికి మేం చిన్నపిల్లలం కాదండి. నాకు మ్యారేజ్ అయ్యింది. అతనికి పెళ్లైంది. ఆవిడ ఆవిడ లైఫ్ ను డిస్ట్రబ్ చేస్తూ..నా లైఫ్ ను డిస్ట్రబ్ చేసింది. నా వైవాహిక జీవితాన్ని డిస్ట్రబ్ చేసింది. నా ఫ్యామిలీని డిస్ట్రబ్ చేసింది. ఆమె కుటుంబాన్ని డిస్ట్రబ్ చేసుకోలేదు. రెండు కుటుంబాల్ని డిస్ట్రబ్ చేసింది. రెండు కుటుంబాల్ని నడి రోడ్డు మీదకు లాక్కొచ్చింది.
- నేను ఒంటరినయ్యాను. అతను ఒంటరి అయ్యారు. ఒకరి కష్టాల్ని ఒకరు చూసుకోవటం తప్పు లేదు కదా? సుప్రీంకోర్టే చెప్పింది.. ఆడల్ట్రరీ తప్పు లేదని. ఇందులో ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు. మేం అయితే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ లో ఉన్నాం. కలిసే ఉన్నాం. టెంపుల్స్ అవి కలిసే వెళుతున్నాం. ఇద్దరం కలిసే ఉన్నాం ఒక రిలేషన్ లో. ఈ ఆరోపణల్ని వాణి చేసిన సమయంలో నేను ఒంటరినయ్యా. ఆ టైంలో నీకు తోడు ఉంటానని.. నాకొక ధైర్యం ఇచ్చారు దువ్వాడ శ్రీనివాసరావు. ఒక ఫ్రెండ్ గా నాకు సపోర్టు చేస్తున్నారు.