Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి చేసుకోలేదని కేసు పెట్టే హక్కు లేదు.. తేల్చిన హైకోర్టు

తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన అంశాల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. బాలిక మైనరే అయినప్పటికి స్వచ్చందంగా అతడితో గడపటం.

By:  Tupaki Desk   |   23 Feb 2025 5:02 AM GMT
రెండో పెళ్లి చేసుకోలేదని కేసు పెట్టే హక్కు లేదు.. తేల్చిన హైకోర్టు
X

ఆసక్తికర తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. తనను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ వివాహిత ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అలా కేసు పెట్టే హక్కు వివాహితకు ఉండదని స్పష్టం చేస్తూ తీర్పును ఇచ్చింది. ఇది తప్పుడు వాగ్దానం కింద రాదని తేల్చిచెప్పింది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన వివాహిత ఒకరికి ఇద్దరు పిల్లలుఅత ఉన్నారు. ఆమె భర్త డ్రైవర్ గా పని చేస్తుంటారు.

అయితే.. ఆమె మరో పెళ్లైన వ్యక్తితో ఆమె సంబంధం పెట్టుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో అతనితో శారీరక సంబంధం పెట్టుకున్న ఆమెకు.. తర్వాతి కాలంలో ఆమెను తాను పెళ్లాడలేనంటూ తేల్చి చెప్పారు. తన భార్యకు విడాకులు ఇవ్వనని స్పష్టం చేశాడు. దీంతో.. అతను తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లుగా పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది.దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వివాహితలు ఇలాంటి ఫిర్యాదులు చేయలేరంటూ తీర్పునిచ్చింది.

మరో ఉదంతంలో ఒక మైనర్ పై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చిన వైనం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. దీనికి కారణాల్ని వివరించిన హైకోర్టు.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లపై అత్యాచారాల్ని నిరోధించేందుకు పోక్సో చట్టాన్ని తెచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. బాధితురాలు మైనర్ బాలికే అయినప్పటికి పరస్పరం స్వచ్ఛందంగా సదరు వ్యక్తితో గడిపిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయొచ్చని స్పష్టం చేసింది.

పోక్సో చట్టం కింద 2019 లో యువకుడిపై కేసు నమోదైంది. అప్పటికి నిందితుడి వయసు 19 ఏళ్లు కాగా.. బాలిక వయసు 14 ఏళ్లు మాత్రమే. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి స్వచ్చందంగా అతడితో మూడు రాత్రిళ్లు.. పగళ్లు గడిపింది. ఈ ఉదంతంలో సదరు వ్యక్తి ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన అంశాల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. బాలిక మైనరే అయినప్పటికి స్వచ్చందంగా అతడితో గడపటం.. అలా గడపటం ద్వారా అందుకు జరిగే పర్యవసానాలు తెలిసే చేయటం.. ఆ విషయాన్ని సదరు బాలిక ఒప్పుకోవటంతో నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ ఉదంతంలో బాలిక తండ్రికి కూడా వీరి విషయం తెలుసన్న అంశాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెర తీసింది.