ఓటుకు ల్యాప్ టాప్, డైమండ్ రింగ్
ఓట్లు వేయండి. ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు తీసుకెళ్లండి
By: Tupaki Desk | 1 May 2024 2:30 PM GMTఓట్లు వేయండి. ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు తీసుకెళ్లండి. ఇదేదో రాజకీయ పార్టీ అభ్యర్థుల ఓటుకునోటు వ్యవహారం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటర్లలో చైతన్యం వచ్చి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఇస్తున్న బంపర్ అఫర్.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ మేరకు ఓటర్లకు బహుమతులను ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 మొదటి, రెండో విడత పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది.
దీంతో భోపాల్ ఎన్నికల అధికారులు ఈ అఫర్ ప్రకటించారు. దీని కోసం పలు చోట్ల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ వివరాలతో కూడిన ఫారాలను నింపి బాక్స్‌లలో వేయాలి. ఆ తర్వాత ఎన్నికల అధికారులు బాక్స్ లను ఓపెన్ చేసి విజేతలను ఎంపికచేస్తారు. ఓటేసినట్టు వేలిపై ఉన్న సిరా ఇంకును చూసి విజేతలకు బహుమతి ఇస్తారు.
ఈ వేసవిలో ఎండలు ఏప్రిల్ లోనే దంచి కొడుతున్నాయి. వందేళ్ల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఇళ్లను విడిచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు మళ్లి చూసేందుకు భయపడుతున్న నేపథ్యంలో అధికారులు వారిని ఉత్సాహ పరిచేందుకు ఈ చర్యలు చేపట్టారు.