Begin typing your search above and press return to search.

మాగంటి సైకిల్ దిగి ఆ పార్టీలోకి...!?

దాంతో మాగంటి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. జగన్ నేరుగా ఆహ్వానం అందించడంతో మాగంటి సుముఖత వ్యక్తం చేశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2024 3:11 PM GMT
మాగంటి సైకిల్ దిగి ఆ పార్టీలోకి...!?
X

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు టీడీపీకి గుడ్ బై కొట్టేస్తారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి. ఆయన టీడీపీ మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. తాను సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నా కనీసం పార్టీ పట్టించుకోలేదు అన్న ఆవేదన ఆయనలో కనిపిస్తోంది. మాగంటి బాబు ఈసారి కచ్చితంగా ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు.

ఆయన చాలా కాలంగా చురుకుగా పనిచేస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు పడ్డారు. తన ఇద్దరు కుమారులు ఆకస్మికంగా మరణించినా గుండె నిబ్బరం చేసుకుని మరీ తిరిగి పార్టీలో క్రియాశీలం అయ్యారు. గత అయిదేళ్లుగా పార్టీని కష్టకాలంలో నిలబెడుతూ వచ్చారు.

అటువంటిది తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారని అంటున్నారు. మాగంటి బాబుకు ఆయన కుటుంబానికి రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆయన కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి ఆయన తల్లి మాగంటి లక్ష్మీదేవి ఇద్దరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు.

మాగంటి బాబు కూడా రాష్ట్ర మంత్రిగా వైఎస్సార్ క్యాబినేట్ లో పనిచేశారు. ఆయన 1998లో తొలిసారి ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన మళ్లీ 2014లో మరోసారి ఎంపీగా గెలిచారు. ఈ మధ్యలో ఆయన 2004 నుంచి 2009 వరకూ మంత్రిగా ఉమ్మడి ఏపీలో పనిచేశారు

ఆయన తండ్రి నాటి నుంచి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం వారి చేతులలో ఉంది. అలాంటిది ఈసారి ఆ సీటుని పుట్టా మహేష్ యాదవ్ కి చంద్రబాబు ఇచ్చారు. దాంతో మాగంటి కలవరం చెందారు. 2014లో లక్ష ఓట్ల మెజరిటీతో తాను సీటు గెలిచినా ఈసారి కనీసం పట్టించుకోలేదని పైగా జిల్లా కాని వారికి నాన్ లోకల్ కి సీటు ఎలా ఇస్తారని ఆయన మధన పడుతున్నారు.

ఇక మాగంటి విషయం తీసుకుంటే ఆయనకు జగన్ స్వయంగా ఫోన్ చేశారని ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ కి ఇష్టమైన నేతగా మాగంటి ఉండేవారు. ఇపుడు జగన్ ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరితో బలమైన నేత పటిష్టమైన క్యాడర్ వైసీపీ వైపు మళ్ళుతుందని భావించే మధ్యవర్తులు లేకుండా ఏకంగా జగన్ ఆయనకు ఫోన్ కాల్ చేశారు అని అంటున్నారు.

దాంతో మాగంటి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. జగన్ నేరుగా ఆహ్వానం అందించడంతో మాగంటి సుముఖత వ్యక్తం చేశారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న మాగంటి తన అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారని తెలుస్తోంది. ఆ సమావేశంలో ఆయన కీలకమైన నిర్ణయం ప్రకటించనున్నారు అని అంటున్నారు.

మాగంటి వంటి సీనియర్లను కష్టపడే వారిని టీడీపీ గుర్తించడం లేదు అని ఆయనతో పాటు అనుచరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వైసీపీలో చేరేందుకు మాగంటి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆయన రెండు రోజూల్లో జగన్ ని కలసి పార్టీ తీర్ధం పుచుకుంటారు అని అంటున్నారు. మాగంటి కనుక పార్టీ మారితే అది పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి దెబ్బ పడేలా ఉంటుందని కూడా అంచనా కడుతున్నారు.