Begin typing your search above and press return to search.

మాగ్నెట్ ఫిషింగ్ .. మార్చిన జీవితం

మాగ్నెట్ ఫిషింగ్ ఆ జంట జీవితాన్ని మార్చింది. అదృష్టం వరించి లక్షాధికారులు అయ్యారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 5:30 PM GMT
మాగ్నెట్ ఫిషింగ్ .. మార్చిన జీవితం
X

మాగ్నెట్ ఫిషింగ్ ఆ జంట జీవితాన్ని మార్చింది. అదృష్టం వరించి లక్షాధికారులు అయ్యారు. దీంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయింది. న్యూయార్క్ కు చెందిన జేమ్స్ కేన్, బార్బీ అగొస్తిని అనే జంటకు మాగ్నెట్ ఫిషింగ్ చేయడం అలవాటు. చేపల వేట మాదిరిగానే గాలానికి చివర పెద్ద అయస్కాంతాన్ని కట్టి నీటిలో పడిన వస్తువులను గాలించడమే ఈ మాగ్నెట్ ఫిషింగ్.

నీటి అడుగున పడిపోయిన విలువైన వాచీలు, ఫోన్లు, ఇనుప పెట్టెలు ఇందులో బయటపడుతుంటాయి. కేన్, అగొస్తిని జంట కరోనా కాలం నుంచి ఇలా మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నారు.

తాజాగా న్యూయార్క్ లేక్ లో మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఈ జంటకు ఒక ఇనుప పెట్టె దొరికింది. దానిని తెరిచి చూడగా నీటిలో తడిచి పాడైపోయిన స్థితిలో ఉన్న వంద డాలర్ల నోట్లు (మన కరెన్సీలో రూ.83 లక్షలు) ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించగా ఆ వస్తువు యజమాని ఆచూకీ లభించలేదు. అక్కడి చట్టాల ప్రకారం వస్తువు యజమానిని గుర్తించలేని పరిస్థితి ఉంటే అది దొరికిన వారికే చెందుతుంది. దీంతో పోలీసులు ఆ డాలర్లను ఆ దంపతులకే ఇచ్చేశారు. పాడైపోయిన డాలర్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉండడంతో ఆ దంపతులు సంతోషంలో మునిగిపోయారు.