Begin typing your search above and press return to search.

డ్రింక్ చేసి చెస్ పోటీల్లో పాల్గొన్నా.. బోర్డుపై నీళ్లు చల్లా.. కార్లసన్ సంచలనం

సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు నిజం చెప్పే సవాలును స్వీకరించటంచాలా చాలా అరుదు.

By:  Tupaki Desk   |   25 April 2024 9:30 AM GMT
డ్రింక్ చేసి చెస్ పోటీల్లో పాల్గొన్నా.. బోర్డుపై నీళ్లు చల్లా.. కార్లసన్ సంచలనం
X

సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు నిజం చెప్పే సవాలును స్వీకరించటంచాలా చాలా అరుదు. అలాంటి క్లిష్టమైన అంశాలు జోలికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే.. సమాజంలో తమకు లభించే గౌరవ మర్యాదల విషయంలో వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు. అలాంటిది చెస్ దిగ్గజ ఆటగాడు కర్లసన్ మాత్రం అందుకు భిన్నంగా.. అన్నీ నిజాలే చెబుతానని స్పష్టం చేయటమే కాదు ఆ సవాల్ ను స్వీకరించాడు. ఇది అల్లాటప్పా సవాల్ కాదు. ఎందుకంటే.. సమాధానాలు చెప్పే వేళ.. పాలీగ్రాఫ్ నిపుణుడు.. అతడి ప్రతి సమాధానాన్ని పరిశీలించి.. అతను నిజం చెబుతున్నాడా? అబద్ధం చెబుతున్నాడా? అన్న విషయాన్ని చెప్పేస్తుంటారు.

నిజాలు చెబుతానన్న సవాల్ కోసం లై డిటెక్టర్ టెస్టుకు దిగిన వేళ.. అతను అన్నీ నిజాలే చెప్పటం విశేషం. చెట్ డాట్ కామ్ పోస్టు చేసిన వీడియోలో కార్లసన్ ను మరో దిగ్గజ సీనియర్ ఆటగాడు.. ప్రస్తుతం చెస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డేవిడ్ హోవెల్ ప్రశ్నలు సంధించగా కార్లసన్ సమాధానాలు ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో హోవెల్ ను కార్లసన్ కూడా ప్రశ్నలు అడిగారు.

ఈ వీడియోను క్యాండిడేట్స్ టోర్నీని గుకేశ్ గెలవకముందు తీసింది. సవాల్ లో భాగంగా కార్లసన్ పలు క్లిష్టమైన.. సున్నితమైన ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్ని సైతం ఓపెన్ గా చెప్పేవారు. తన కెరీర్ లో ఒకసారి మాత్రం తాగి చెస్ పోటీలో పాల్గొన్నట్లు చెప్పాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం పోటీ పడనందుకు ఫీల్ అవుతున్నావా? అని ప్రశ్నించగా నో అని చెప్పాడు. దీనికి పాలిగ్రాఫ్ నిపుణుడు సైతం అతను నిజమే చెప్పినట్లుగా పేర్కొన్నారు.

కెరీర్ లో అత్యంత ఇబ్బందికర సందర్భం గురించి అడగ్గా.. ఒకసారి తాను ఫ్యాంట్లో యూరిన్ పోసుకున్నట్లుగా తెలిపాడు. అంతేకాదు.. బోర్డుపై నీళ్లు చల్లానని.. పావుల్ని పడేశానంటూ తాను చేసిన తప్పుల్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ ఈసారి టైటిల్ నిలుపుకుంటారా? అని అడిగితే.. నో అని సమాధానం ఇవ్వటం ఆసక్తికరం. మొత్తంగా నిజాలు చెప్పే కఠినమైన సవాలును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయటం ద్వారా.. కార్లసన్ వార్తల్లో నిలిచారు. నిజాలు చెప్పేందుకు.. తప్పులు ఒప్పుకునేందుకు టన్నుల కొద్దీ ధైర్యం అవసరం. అది తనలో పుష్కలం అన్న విషయాన్ని కార్లసన్ తాజా ఎపిసోడ్ లో స్పష్టం చేశారని చెప్పాలి.