మాగుంటకు మూడుతోందా..!
ఆయన ప్రమేయాన్ని ప్రస్తావించలేదు. కానీ, ఈవిషయాన్ని అదికారులు వదిలేసినా.. సుప్రీంకోర్టు మాత్రం వదిలి పెట్టలేదు. తీవ్రంగా వ్యాఖ్యానించింది.
By: Tupaki Desk | 29 Aug 2024 11:30 AM GMTఒంగోలు ఎంపీ, టీడీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మూడుతోందా? ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసేలా పరిణామాలు మారుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ముందు కూడా.. ఆయన కీలక సమస్యల్లో ఉన్నారు. అయితే.. వాటిని తనదాకా రాకుండా చాలా జాగ్రత్తగా మెయిన్ టెన్ చేసుకున్నారు. కానీ..ఇప్పుడు మాత్రం సదరు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. అదే ఢిల్లీ మద్యం కుంభకోణం! ఆశ్చర్యంగా ఉన్నా నిజం.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీలో వెలుగు చూసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి రెం డు తెలుగు రాష్ట్రాల వరకు కూడా పాకాయి. ఈ కేసులోనే కేసీఆర్ తనయ కవిత సహా మాగుంట కుమారు డు రాఘవరెడ్డి కూడా అరెస్టయ్యారు. ఈ పరిణామాలతోనే ఎన్నికల సమయంలో మాగుంటకు టికెట్ కూడా దక్కలేదు. కట్ చేస్తే.. ఈ కేసు నుంచి కొంత ఊరట పొందామని భావిస్తున్న మాగుంటకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చిన అధికారులు మాగుంటను వదిలేశారు.
ఆయన ప్రమేయాన్ని ప్రస్తావించలేదు. కానీ, ఈవిషయాన్ని అదికారులు వదిలేసినా.. సుప్రీంకోర్టు మాత్రం వదిలి పెట్టలేదు. తీవ్రంగా వ్యాఖ్యానించింది. కొందరి విషయంలో ఎందుకు ఇలా చేశారంటూ.. మాగుంట వ్యవహారాన్ని హైలెట్ చేసింది. కవితకు బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాగుంట కుమారుడి పాత్ర ఉనప్పుడు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు పాత్ర లేదని ఎలా చెబుతారు? ఎలా అప్రూవర్‌గా మారుస్తారు? మీ ఇష్టమా? అంటూ నిలదీసింది.
ఈ పరిణామాలు.. మాగుంట మెడకు చుట్టుకోనున్నాయి. అంతేకాదు.. కేసును లోపభూయిష్టంగా విచారిం చారన్న సుప్రీంకోర్టు మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కేసులో చేర్చాలని ఆదేశిం చింది. దీంతో మాగుంట మెడకు కూడా.. కేసుచుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన పేరును చేర్చడంతోపాటు.. ఆయనను కూడీ సీబీఐ విచారించడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మాగుంట న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. తనను అరెస్టు చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.