నెట్టింట దంచి కొడుతున్న దండలమ్మే అమ్మాయి... వీడియో వైరల్!
తాజాగా జరుగుతున్న మహా కుంభమేళాలో గత కొన్ని రోజులుగా మోనాలిసా అనే దండలు అమ్మే అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
By: Tupaki Desk | 21 Jan 2025 6:04 AM GMTఒకప్పుడు సెలబ్రెటీలు, లెజెండ్ లు అవ్వాలంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి వచ్చేదంటారు. పైగా.. గుమ్మడికాయంత కష్టం మాత్రమే సరిపోదు దానికి ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలని చెబుతారు. అయితే.. అది గతం! ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రి సంచలనంగా మారిపోతుంటారు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోతుంటారు.
అలా అయినవారి జాబితా నెట్టింట చాలానే ఉంది. ఈ జాబితాలో తాజాగా వచ్చి చేరిన సంచలనం ఓ దండలు అమ్మే అమ్మాయి. ఇప్పుడు ఆమెను "మహా కుంభ్ మోనాలిసా" అని పిలుస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. లైక్ లు కామెంట్లతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వెళ్లడిస్తున్నారు.
అవును... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ సాధువులు, సన్యాసులు, అఘోరీలు ప్రత్యక ఆకర్షణగా నిలుస్తున్నారని అంటున్నారు. వారు కూడా నెట్టింట వైరల్ అవుతున్నారు. వారిలో ‘ఐఐటియన్ బాబా’ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇదే కుంభమేళాలో ఓ అమ్మాయి తాజా సంచలనం!
తాజాగా జరుగుతున్న మహా కుంభమేళాలో గత కొన్ని రోజులుగా మోనాలిసా అనే దండలు అమ్మే అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇండోర్ కు చెందిన ఆమె దండలు విక్రయిస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో నెట్టింట దర్శనమివ్వడం.. నెటిజన్లు ఫ్లాట్ అవ్వడం జరిగిపోయింది!
ప్రధానంగా ఆమె డస్కీ స్కిన్ టోన్ తో పాటు పెద్ద పెద్ద కళ్లు, మనోహరమైన ముఖం, అమాయకత్వంతో కూడిన చిరునవ్వు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసిందని చెబుతున్నారు. ఆమె నిజంగా నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే ఆమెను "మహా కుంభ్ మోనాలిసా" అంటూ అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కోరికల చిట్టా బయటపెడుతున్నారు.
ఇందులో భాగంగా... ఆమె ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్స్ కంటే చాలా అందంగా ఉందని, ఈమెను సినిమాల్లోకి తీసుకోవాలని, హీరోయిన్ గా అవకాశం ఇవాలని పలువురు నెటిజన్లు కోరుతుండటం గమనార్హం. మరి ఈమె ఫ్యాన్స్ డిమాండ్ ను బాలీవుడ్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి!