Begin typing your search above and press return to search.

సీఎం రేసులో ఫడ్నవీస్...షిండేకు షాక్ ?

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు శనివారం వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అత్యధికం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి కట్టబెట్టాయి

By:  Tupaki Desk   |   22 Nov 2024 7:30 PM GMT
సీఎం రేసులో ఫడ్నవీస్...షిండేకు షాక్ ?
X

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు శనివారం వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అత్యధికం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి కట్టబెట్టాయి. దాంతో ఫలితాలు రాకుండా బీజేపీ కూటమిలో సీఎం కుర్చీ రేసు మొదలైంది

ప్రస్తుత సీఎం ఏక్ నాధ్ షిండేని పక్కకు జరిపి మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేయాలని కమలనాధులు ఆలోచిస్తున్నారు. బీజేపీకి సీఎం పోస్టు కావాలని అంటున్నారు. గత అయిదేళ్లలో మిత్రులకు చాన్స్ ఇచ్చి తగ్గారు కానీ ఈసారి అసలు వదులుకోరని అంటున్నారు.

దాంతో మహా సీఎం పదవి విషయంలో పెద్ద రచ్చ సాగేలా సీన్ కనిపిస్తోంది. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 288 సీట్లు ఉన్న శాసనసభలో అధికారం చేపట్టాలి అంటే 145 సీట్లు దక్కాలి. బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తాయి కానీ మిత్రులు సాయంతోనే పీఠం ఎక్కాల్సి ఉంటుంది.

అయితే శివసేనను చీల్చి వచ్చిన ఏక్ నాధ్ షిండేకు ఉన్న బలం అదే విధంగా ఎన్సీపీ ని చీల్చి వచ్చిన అజిత్ పవార్ బలం కూడా బీజేపీకి ఈ ఎన్నికల్లో కలసి వచ్చాయని అంటున్నారు. దాంతో ఆ ఇద్దరు దిగ్గజ నేతలను కూడా శాంతపరచినపుడే బీజేపీకి పీఠం దక్కుతుంది.

ఇవన్నీ పక్కన పెడితే ఫడ్నవీస్ కే సీఎం పీఠం దక్కాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఫడ్నవీస్ కూడా సీఎం పదవి కోసమే చూస్తున్నారు. ఆయన ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. కానీ బీజేపీ పెద్దలు ఇచ్చిన హామీ మేరకే ఆయన తిరిగి ఉత్సాహంగా బరిలోకి దిగారు అని అంటున్నారు.

ఇపుడు కాదంటే బీజేపీలోనే ముసలం పుడుతుంది అని అంటున్నారు. ఇక ఏక్ నాధ్ షిండేకు సీఎం పదవి ఇవ్వకపోతే ఆయన వర్గం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియదు. సందట్లో సడేమియా అన్నట్లుగా అజిత్ పవార్ వర్గం అయితే ఏకంగా పోస్టర్లు వేసింది. కాబోయే సీఎం అంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టి ఆ తరువాత తొలగించారు.

దాంతో అజిత్ పవార్ వర్గం కూడా తమకే సీఎం కావాలని పట్టుబడుతుంది అని అంటున్నరు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో కూటముల ప్రభావం ఉంది. ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. దాంతో సీఎం ఆశావహులకు ఈ కూటమి కాకపోతే ఆ కూటమి అన్నట్లుగానే ఉంటుంది అని అంటున్నారు.

అది బీజేపీకి ఇబ్బందిగానే మారుతుందని చెబుతున్నారు. షిండేను కాదంటే ఆయన కూటమి మార్చే సీన్ కూడా ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. ఇక సొంత బాబాయ్ శరద్ పవార్ అటు వైపు ఉన్నారు కాబట్టి అజిత్ పవార్ కూడా జీవిత కాలంలో ఒకసారి అయినా సీఎం కావాలన్న ముచ్చటను తీర్చుకునేందుకు ఏమైనా చేస్తారు అన్న మాట ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ నాయకత్వంలోని కూటమి గెలిస్తే కదా అని ఇండియా కూటమి అంటోంది. తమదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మేది లేదని అంటోంది. మొత్తానికి చూస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తరువాత రాజకీయాలు అక్కడ రసకందాయంలో పడనున్నాయని అంటున్నారు.