Begin typing your search above and press return to search.

'మ‌న ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చ‌లేం': బీజేపీకి భారీ దెబ్బ‌

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తులు స్పందిస్తూ..''మ‌న ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చుకోలేం. మీరు చెబుతున్న లౌకిక వాదం, సామ్య‌వాదం వంటి ప‌దాలు అభ్యంత‌క‌ర‌మ‌ని భావించేవారు ఉండొచ్చు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 7:30 PM GMT
మ‌న ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చ‌లేం: బీజేపీకి భారీ దెబ్బ‌
X

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సొంతం చేసుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు రూపంలో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. రాజ్యాంగంలోని 'లైకికవాద, సామ్య‌వాద‌' ప‌దాల‌ను తొల‌గించాలంటూ.. బీజేపీ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి(పైకి ఈయ‌నే అయినా.. తెర‌వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌న్న‌ది వాస్త‌వమ‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు) స‌హా అడ్వ‌కేట్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ‌(ఈయ‌న కూడా బీజేపీ సానుభూతిప‌రుడే) దాఖ‌లు చేసిన రెండు వేర్వేరు పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ రెండు పిటిష‌న్ల‌పై ఇప్ప‌టికే సుదీర్ఘ వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు తాజాగా సోమ‌వారం సాయంత్రం తీర్పు ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తులు స్పందిస్తూ..''మ‌న ఇష్టానుసారం రాజ్యాంగాన్ని మార్చుకోలేం. మీరు చెబుతున్న లౌకిక వాదం, సామ్య‌వాదం వంటి ప‌దాలు అభ్యంత‌క‌ర‌మ‌ని భావించేవారు ఉండొచ్చు. కానీ, ప్ర‌జాస్వామ్య ప‌రిఢ‌త్వానికి(స్ట్రాంగెస్ట్ ఆఫ్ డెమొక్ర‌సీ), ప్ర‌జాస్వామ్య బ‌లోపేతానికి(స్ట్రెంథెన్ ఆఫ్ డెమొక్ర‌సీ) ఈ రెండు 'ప‌దాలు' అత్యంత కీల‌కం. మీతో ఏకీ భ‌వించే వారు ఉన్న‌త మాత్రాన‌, మీరు కోరుకున్న విధంగా, మ‌నం కోరుకున్న విధంగా వాటిని తొలగించ‌డం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సోష‌లిజం, సెక్యుల‌రిజం అనేవి దేశ స‌ర్వోన్న‌త ఉన్న‌తికిదోహ‌ద‌ప‌డే అంశాలు. వీటిని తొల‌గించ‌లేరు'' అని విస్ప‌ష్ట తీర్పు ఇచ్చారు.

పిటిష‌న్ ఏం చెబుతోంది?

బీజేపీ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, న్యాయ‌వాది అశ్వినీ కుమార్ దాఖ‌లు చేసిన రెండు వేర్వేరు పిటిష‌న్ల‌పై సుదీర్ఘ విచార‌ణ సాగింది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎప్పుడైతే.. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాల‌ని నిర్ణ‌యించుకుందో అప్పుడే.. 'సామ్య‌వాద‌, లౌకిక వాద‌' అనే రెండు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. రాజ్యాంగం ప్ర‌కారం.. అన్ని మ‌తాలు, కులాలు స‌మానం, అంద‌రూ స‌ర్వ‌స‌మానులే. అందుకే మ‌న దేశంలో ముస్లింల‌కు ప‌ర్స‌న‌ల్ చ‌ట్టాలు ఉన్నాయి. అదేవిధంగా జురాష్ట్రియ‌న్ల‌కు, సిక్కుల‌కు కూడా ప్ర‌త్యేక రూల్స్ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ రెండు ప‌దాల‌ను తొల‌గించాల‌న్న‌ది పిటిష‌న‌ర్ల వాద‌న‌.

అంతేకాదు.. రాజ్యాంగం 1949, న‌వంబ‌రు 26న ఆమోదం(రాజ్యాంగ స‌భ ద్వారా) పొందిన‌ప్పుడు.. రాజ్యాంగానికి త‌ల‌మానిక మైన పీఠిక‌లో 'లౌకిక‌, సామ్య‌వాద‌' అన్న ప‌దాలు లేని మాట వాస్త‌వమే. వీటిని దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన 1976లో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ పార్ల‌మెంటులో చ‌ర్చ‌లేకుండానే రాజ్యాంగంలో '42వ స‌వ‌ర‌ణ‌'(అత్యంత కీల‌కం) ద్వారా ఈ రెండు ప‌దాల‌ను చేర్చారు. ఈ నేప‌థ్యంలోనే వీటిని తొల‌గించాల‌ని, చీక‌టి పాల‌న‌లో వీటిని చేర్చార‌న్న‌ది పిటిష‌న‌ర్ల వాద‌న‌. దీంతో ఏకీభ‌విస్తూ.. మ‌రికొన్ని పిటిష‌న్లు కూడా దాఖ‌ల‌య్యాయి. అందుకే దీనిని సుదీర్ఘ విచాణ‌కు చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం ఇటీవ‌లే తీర్పును రిజ‌ర్వ్ చేసింది. తాజాగా సోమ‌వారం ఆయా పిటిష‌న్ల‌ను కొట్టేస్తూ.. తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం.