Begin typing your search above and press return to search.

ఈవీఎంలపై అనుమానాలున్నాయి..ప్రమాణం చేయం..మహారాష్ట్రలో మరో మెలిక

దేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం.. ఆర్థిక రాజధాని కొలువైన రాష్ట్రం.. భౌగోళికంగా మూడో అతి పెద్దరాష్ట్రం.. కానీ, అనిశ్చితిలో చిన్న రాష్ట్రాలను తలపిస్తోంది

By:  Tupaki Desk   |   7 Dec 2024 1:30 PM GMT
ఈవీఎంలపై అనుమానాలున్నాయి..ప్రమాణం చేయం..మహారాష్ట్రలో మరో మెలిక
X

దేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం.. ఆర్థిక రాజధాని కొలువైన రాష్ట్రం.. భౌగోళికంగా మూడో అతి పెద్దరాష్ట్రం.. కానీ, అనిశ్చితిలో చిన్న రాష్ట్రాలను తలపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల పైగా విరామం అనంతరం ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలో అనేక డ్రామాలు నడిచాయి. మరెన్నో మలుపులు.. ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడినా శాఖల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.

ఎన్నికల్లో గెలిచి.. సర్కారులో ఓడి

మహారాష్ట్ర ఫలితాలను చూస్తే.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఎన్నికల్లో గెలిచి, సర్కారు ఏర్పాటులో ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేన (ఉద్ధవ్‌) 20, కాంగ్రెస్‌ 16, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2, జన్‌ సురాజ్య శక్తి 2, రాష్ట్రీయ యువత స్వాభిమాన్‌ పార్టీ, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష, ఏఐఎంఐఎం, సీపీఎం, పీడబ్ల్యూపీఐ, ఆర్‌వీఏ చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈమొత్తం కలిపినా 51 మాత్రమే.

‘మహాయుతి’ మాత్రం ప్రభంజనం సృష్టించింది. మొత్తం 288 సీట్లకు 233 ఈ కూటమి ఖాతాలోకే చేరాయి.

చోట్ల గెలుపొందింది. భాజపా 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (శిందే) 57, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. అదే గనుక హంగ్ ఫలితం వచ్చి ఉంటే కథ వేరేగా ఉండేది. మహా వికాస్ అఘాడీకి కాస్త పైచేయి సాధించే అవకాశం దక్కితే రాజకీయం రసవత్తరంగా మారేది.

అసెంబ్లీ కొలువుదీరినా..

ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి శనివారం ముహూర్తం నిర్ణయించారు. అయితే, మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు దీనిని బహిష్కరించాలని నిర్ణయించారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, శివసేన (యూబీటీ) కీలక నాయకుడు, మాజీమంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. కూటమిలో వీరి పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణం చేయడం లేదని చెప్పాడు. దీనికి కారణం.. ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలు ఉండడమే అని పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యాన్ని చంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరని ఆదిత్య పేర్కొన్నారు.