టీపీసీసీ అధ్యక్షుడి రేర్ ఫీట్.. తెలిస్తే వావ్ అనాల్సిందే
ఇదంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధిగా వ్యవహరిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ కు ఉన్న స్పెషల్ టాలెంట్ గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
By: Tupaki Desk | 1 April 2025 4:08 AMఅందరికి తెలిసిన రాజకీయ నాయకులకు సంబంధించి అప్పుడప్పడు కొన్ని అరుదైన విషయాలు బయటకు వస్తుంటాయి. అలా వచ్చిన సందర్భంలో అందరికి తెలిసిన ప్రముఖుడే అయినప్పటికీ.. కొన్ని విషయాలు తెలీవన్న విషయం అర్థమవుతుంది. ఇదంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధిగా వ్యవహరిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ కు ఉన్న స్పెషల్ టాలెంట్ గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వైడబ్ల్యూసీఏలో జరిగిన కరాటేలో మూడు గంటల పాటు సాగిన నైపుణ్య పరీక్షలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు. తన జీవితంలో కరాటే ఒక భాగంగా చెప్పారు. అంతేకాదు.. 2027లో హైదరాబాద్ మహానగరంలో ఆసియా కరాటే పోటీల్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.
ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. చూసినంతనే టిప్ టాప్ గా ఉంటే.. ఫిట్ అన్నట్లుగా కనిపించే చాలామంది రాజకీయ ప్రముఖులకు బోలెడన్ని అనారోగ్య అంశాలు ఉంటాయి. అందుకు భిన్నంగా అరవైఏళ్లకు దగ్గరకు వచ్చేసిన మహేశ్ కుమార్ మాత్రం ఫిట్ గా ఉండటమే కాదు.. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో తన సత్తా చాటటానికి మించిన స్పెషల్ ఇంకేం ఉంటుంది. ఇప్పటివరకు మహేశ్ కుమార్ కు ఉన్న ఇమేజ్ ను తాజా అంశం డబుల్ చేస్తుందని చెప్పక తప్పదు.