తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By: Tupaki Desk | 7 March 2025 7:52 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్-కేడర్ ఎస్పీలతో పాటు 14 మంది ఎస్పీలు ఉన్నారు.
* ప్రధాన మార్పులు:
- అనిల్ కుమార్ అదనపు డీజీ (పర్సనల్)గా నియమితులయ్యారు. అదనంగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.
-ఎం శ్రీనివాసులు సీఐడీ ఐజీగా, సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా, సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా, అంబర్ కిషోర్ రామగుండం పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
-సింధు శర్మ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.
*ఇతర ముఖ్య బదిలీలు:
-ఆకాంక్ష యాదవ్ భువనగిరి డీసీపీగా, చేతన మహిళ భద్రతా విభాగం ఎస్పీగా, రూపేష్ నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా నియమితులయ్యారు.
-రాజేష్ చంద్ర కామారెడ్డి ఎస్పీగా, పారితోష్ పంకజ్ సంగారెడ్డి ఎస్పీగా, జీఎం బాబా సాహెబ్ రాజన్న సిరిసిల్ల ఎస్పీగా బదిలీ అయ్యారు.
-అంకిత్ కుమార్ వరంగల్ డీసీపీగా, ఎ భాస్కర్ మంచిర్యాల డీసీపీగా, కే నర్సింహ సూర్యాపేట ఎస్పీగా నియమితులయ్యారు.
-శిల్పవల్లి హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, సాయిశేఖర్ ఎస్ఐబీ ఎస్పీగా, కరుణాకర్ పెద్దపల్లి డీసీపీగా, రవీందర్ సీఐడీ ఎస్పీగా నియమితులయ్యారు.
-గౌస్ ఆలమ్ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
ఈ బదిలీలకు ముందు, గురువారం జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాబినెట్ భేటీ翌 రోజు ఐపీఎస్ అధికారుల బదిలీ జరగడం గమనార్హం