Begin typing your search above and press return to search.

ట్రంప్‌.. చెత్త ట్రక్.. అధ్యక్ష ప్రమాణం.. వీఐపీ అతిథి

మరొక్క ఐదు రోజుల్లో అగ్ర రాజ్యం అమెరికా చరిత్రలో కొత్త శకం మొదలుకానుంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క తీరున పరిస్థితులు మారనున్నాయి.

By:  Tupaki Desk   |   14 Jan 2025 5:30 PM GMT
ట్రంప్‌.. చెత్త ట్రక్.. అధ్యక్ష ప్రమాణం.. వీఐపీ అతిథి
X

మరొక్క ఐదు రోజుల్లో అగ్ర రాజ్యం అమెరికా చరిత్రలో కొత్త శకం మొదలుకానుంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క తీరున పరిస్థితులు మారనున్నాయి. ఎందుకంటే.. ఈసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేది డొనాల్డ్ ట్రంప్. స్థిరమైన అభిప్రాయాలు.. అంతే బలంగా వాటిని అమలు చేయగల సామర్థ్యం ట్రంప్ సొంతం. ఆయనే గనుక 2020-24 మధ్య అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇప్పటికన్నా ప్రపంచం భిన్నంగా ఉండేదని చెప్పొచ్చు.

ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి హాజరయ్యే ప్రముఖుల (వీఐపీ) జాబితా కూడా సిద్ధమైంది.

‘మెగా’.. ‘మెగా..’

ట్రంప్ ప్రచారంలో ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మెగా)’.. నినాదం హోరెత్తింది. బైడెన్ పాలనలో అమెరికా వెనుకబడిపోయిందని.. దేశాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తానని ట్రంప్ ప్రచారంలో చెప్పారు. దీనికే మెగా అనే పేరు పెట్టారు. కాగా ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులను బైడెన్‌ చెత్త అని అభివర్ణించారు. అమెరికాలో ద్వి పార్టీ వ్యవస్థ (రెండు పార్టీల వ్యవస్థ). అలాంటి దేశంలో దాదాపు సగం మందిని బైడెన్ చెత్తతో పోల్చినట్లయింది.

ఓవైపు మెగా నినాదంతో వెళ్తున్న ట్రంప్ నకు బైడెన్ వ్యాఖ్యలు కలిసివచ్చాయి. వాటిని ట్రంప్‌ బాగా వాడుకొన్నారు. బైడెన్ చెత్త వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే విస్కాన్సిన్‌ ఎయిర్‌ పోర్టులో నారింజ రంగ్‌ సేఫ్టీ జాకెట్‌ ధరించి.. ట్రంప్‌ ఓ ట్రక్కును డ్రైవ్‌ చేసారు. గ్రీన్‌బే ర్యాలీకి దానిని తీసుకెళ్తూ.. నా ఈ చెత్త ట్రక్కును మీరు ఇష్టపడుతున్నారా..? అని మీడియాను ప్రశ్నించారు. అలా ర్యాలీలో ట్రంప్ తో పాటు ట్రక్కు కూడా సభా వేదిక వద్దకు వెళ్లింది. తమవాళ్లు ఈరోజు ‘చెత్త’ అనే పదం ట్రెండింగ్ లో ఉంది. మీరు చెత్త ట్రక్కును నడుపుతారా? అని అడిగారని, వెంటనే వాళ్లు దానిని తీసుకొచ్చారని ట్రంప్ చెప్పారు. ఇక బైడెన్‌ నోటి దూలతో చేసిన ‘చెత్త’ వ్యాఖ్యలు కమలా హ్యారిస్‌ విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని విశ్లేషకులు తేల్చారు.

అలా ట్రంప్‌ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్కును ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకురానున్నారట. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ (మెగా) థీమ్‌ తో ప్రమాణ స్వీకార ర్యాలీలో ఇది అభిమానులను అలరించనుందట.