Begin typing your search above and press return to search.

నల్లాలో నీళ్లు రావడం లేదని ఢిల్లీలో ఎమ్మెల్యే లొల్లి !

అయితే మొన్నటి వరకు ఎండలతో తల్లడిల్లిన ఢిల్లీలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Jun 2024 6:46 AM GMT
నల్లాలో నీళ్లు రావడం లేదని ఢిల్లీలో ఎమ్మెల్యే లొల్లి !
X

నల్లాలో నీళ్ళు రాట్లేదని ఢిల్లీ ఏపీ భవన్ లో తెలంగాణలోని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీరంగం సృష్టించినట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల కోసం, ఎవరికి ఇవ్వాలనే చర్చల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో వారం రోజులుగా ఉంటున్నారు.

అయితే మొన్నటి వరకు ఎండలతో తల్లడిల్లిన ఢిల్లీలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ భవన్ పంప్ హౌజ్ మునిగి మోటార్లు పనిచేయక పోవడంతో నీళ్ళు రావడం ఆగిపోయింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలులకు బకెట్ల ద్వారా వారి గదులకు నీటిని పంపిస్తున్నారు.

స్వర్ణముఖి బ్లాక్‌లో ఉన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తన గదిలో నీళ్ళు రావట్లేదని అక్కడున్న ఓ అధికారిని నోటికొచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లింది.

గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై 56794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2018 ఎన్నికల్లో మక్కన్ సింగ్ కేవలం 27181 ఓట్లకు మాత్రమే పరిమితం కాగా, ఈ ఎన్నికల్లో ఏకంగా 92227 ఓట్లు సాధించి 56794 మెజారిటీ సాధించడం విశేషం.