Begin typing your search above and press return to search.

విషం కక్కిన నేతకు ప్రమాణీ స్వీకారానికి ఆహ్వానం.. భారత్ పెద్ద మనసు

మాల్దీవ్స్.. భారత్ కు ఓ మూలన ఉండే దేశం.. మన లక్షద్వీప్ కంటే ఏమీ గొప్పగా ఉండకున్నా.. పర్యాటకానికే పెద్దపీట వేయడంతో బాగా పేరొందింది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 2:30 PM GMT
విషం కక్కిన నేతకు ప్రమాణీ స్వీకారానికి ఆహ్వానం.. భారత్ పెద్ద మనసు
X

మాల్దీవ్స్.. భారత్ కు ఓ మూలన ఉండే దేశం.. మన లక్షద్వీప్ కంటే ఏమీ గొప్పగా ఉండకున్నా.. పర్యాటకానికే పెద్దపీట వేయడంతో బాగా పేరొందింది. దీంతో టూరిస్టులంతా పొలొమంటూ మాల్దీవ్స్ వెళ్లేవారు. అందులోనూ భారతీయులే అధికం. ఆ దేశానికి వీరినుంచే అధిక ఆదాయం వస్తోంది. అయితే, మనసులో ఏ ఉద్దేశం ఉందో? లేక వేరే ఏ దేశమైనా ప్రోత్సహించిందో తెలియదు కానీ.. నాలుగు నెలల కిందట మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధాని మోదీపై విషం కక్కారు.

కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ మోయిజ్జు అసలే భారత్ కు వ్యతిరేకి. దీంతో వారి దేశంలో ఉన్న భారత బలగాలను వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఈక్రమంలో మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు తోడవడంతో ఇరు దేశాల సంబంధాలు క్షీణించాయి. అయితే, మాల్దీవుల వంటి దేశం తోక జాడిస్తే భారత్ ఊరుకుంటుందా? ఆ దేశం స్థానంలో అండమాన్ లో పర్యటించాలంటూ పిలుపునిచ్చింది. దీంతో మాల్దీవ్స్ ఆదాయం పడిపోతుందని బెంబేలెత్తింది. అయితే, ఇవన్నీ పక్కనపెట్టి ఆదివారం నాటి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జును ఆహ్వానించారు.

అప్పట్లో వారు..

మోదీ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన 2014లో సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాల నేతలు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు బిమ్స్‌ టెక్ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈసారి శ్రీలంక, బంగ్లాదేశ్‌

సహా ఆసియా దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలను ఆహ్వానించారు. దీనికి మోయిజ్జు స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలిచిన మోదీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. కాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్‌ దేశాల నేతలను మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో మోదీ ఫోన్‌ లో మాట్లాడారు. నేరుగా వారిని ఆహ్వానించారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్‌ లను కూడా మోదీ ఆహ్వానించారు.