దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం ఏంటో తెలుసా?
దేశంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజిగిరి. దీన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. 2019 లెక్కల ప్రకారం 31,50,303 ఓటర్లున్నారు.
By: Tupaki Desk | 12 May 2024 3:30 PM GMTమనది ప్రజాస్వామ్య దేశం. అత్యంత జనాభా గల దేశాల్లో మొదటిది. మనదేశంలో ఎన్నికలు నిర్వహించడమంటే మాటలు కాదు. కత్తి మీద సామే. ఈనేపథ్యంలో మన దేశంలో అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం. వాటి పరిధి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేశంలో 543 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గాల పేర్ల గురించి ఓ సారి పరిశీలిద్దాం.
దేశంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజిగిరి. దీన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. 2019 లెక్కల ప్రకారం 31,50,303 ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో 15,63,063 ఓట్లు పడ్డాయి. 2014లో మాజీ మంత్రి మల్లారెడ్డి గెలుపొందారు. 2019లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు.
తరువాత అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం ఘజియాబాద్. 2019 లెక్కల ప్రకారం ఇక్కడ 27,28,978 మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సురేష్ బన్సాల్ మీద బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సింగ్ 5 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. అప్పుడు ఇక్కడ 15 లక్షల ఓట్లు నమోదయ్యాయి. దక్షిణ బెంగుళూరు తరువాత అత్యధిక ఓటర్లున్న ప్రాంతం. ఇక్కడ 20 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య 3 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ విజయం సాధించారు. అప్పుడు 11 లక్షల ఓట్లు పోలయ్యాయి.
అత్యధిక ఓటర్లున్న మరో ప్రాంతం మహారాష్ట్రంలోని ముంబయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గం. దీని పరిధిలో విలే పార్లే, చండీవాలి, కుర్లా, కాలిన, వాంద్రే తూర్పు, వాండ్రే వెస్ట్ నియోజకవర్గాలున్నాయి. 18 లక్షల మంది ఓటర్లున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో 9 లక్షల ఓట్లు పడగా పూనమ్ లక్షా 30 వేల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
ముంబయి నార్త్ తరువాత అత్యధిక ఓటర్లున్న ప్రాంతం ఈస్ట్ ఢిల్లీ. ఇక్కడ 17 లక్షల మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీద బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ 3.50 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వాయువ్య ఢిల్లీలో కూడా అత్యధిక మంది ఓటర్లున్నారు. ఇక్కడ 15 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి హన్స్ రాజ్ 5 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.