Begin typing your search above and press return to search.

మల్లారెడ్డా.. మజాకా..! తగ్గేదేలే..!

లేదంటే ఒక కాంట్రావర్సీకి పోయి.. అందులో ఇరుక్కుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 7:22 AM GMT
మల్లారెడ్డా.. మజాకా..! తగ్గేదేలే..!
X

మాజీమంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం ఏదో ఒక కామెంట్స్ చేసి వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటు. లేదంటే ఒక కాంట్రావర్సీకి పోయి.. అందులో ఇరుక్కుంటూ ఉంటారు. ఇంజినీరింగ్ కాలేజీల యజమాని కూడా అయిన మల్లారెడ్డి.. నిత్యం లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సమయం దొరికిందంటే చాలు... చిన్నపిల్లాడిలా మారిపోతారు.

పాలమ్మిన.. పూలమ్మిన.. కాలేజీలు పెట్టిన.. అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగులు ఎంతో ఫేమస్. ఒకప్పటి ఆయన గడిపిన సాధారణ జీవితాన్ని నిత్యం మీడియాతో పంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాన్ని కూడా చెబుతూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు మల్లారెడ్డి. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ పక్కన చేరి రెండ పర్యాయాల్లోనూ మంత్రి పదవులు అనుభవించారు. మంత్రి హోదాల్లో ఉన్నప్పుడు కూడా మల్లారెడ్డి ఏది చేసినా సెన్సేషనలే అయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచేవారు. అటు ప్రత్యర్థి పార్టీలపైనా తనదైన శైలిలో పంచులు వేసేవారు. ఒక్కొక్కరి టార్గెట్ చేస్తూ వారిపై పలు వ్యాఖ్యలు చేసేవారు.

ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మల్లారెడ్డి అప్పుడప్పుడు కాలేజీ పిల్లాడిలా మారిపోతూ ఉంటారు. అంతేకాదు విద్యార్థులతో, తన అభిమానులతో కలిసి స్టెప్పులు వేస్తుండడాన్ని ఇదివరకే చూశాం. అటు.. పార్టీ కార్యక్రమాల్లోనూ చాలా సందర్భాల్లో ఆయన డాన్స్‌లు చేశారు. తన డాన్స్‌లతో కార్యకర్తలను ప్రోత్సహించేవారు. వారిలో ఉత్సాహం నింపేవారు.

అయితే.. 75 ఏళ్ల వయసు కలిగిన మల్లారెడ్డి మరోసారి సంచలనం అయ్యారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఇందులో భాగంగా వివాహానికి ముందు జరిగే అన్ని కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి తన స్టెప్పులతో ఊపేశారు. 75 ఏళ్ల వయసులోనూ బ్రేక్ డాన్స్ చేసి వావ్ అనిపించారు. స్పెషల్ కాస్టూమ్‌తో తన మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి ఆయన డాన్స్‌లు చేశారు. అయితే..ఈ డాన్స్ చేసేందుకు మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియో గ్రాఫర్ల వద్ద ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. గతంలో ఎన్నో మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. ఈసారి మాత్రం సినిమా స్టైల్‌లో స్టెప్పులు వేయడం కనిపించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మల్లారెడ్డి డాన్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.