Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మెగా వేలం లో అన్ని కళ్ళు ఆమె పైనే..

తోలి రోజు జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఎంతో ఉత్సాహంగా సాగింది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 2:54 PM GMT
ఐపీఎల్ మెగా వేలం లో అన్ని కళ్ళు ఆమె పైనే..
X

తోలి రోజు జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ప్రధానంగా ఓ మహిళ ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు. వేలం పాట నిర్వాహకురాలు మల్లిక సాగర్. తనదైన ప్రత్యేకమైన శైలితో సారి ఐపీఎల్ వేలం ప్రక్రియలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మల్లిక. ఇక ఈ నేపథ్యంలో ఆన్లైన్లో మల్లికకు సంబంధించిన వివరాలు వెతికే నెటిజెన్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ఇక మల్లిక సాగర్ వివరాల విషయానికి వస్తే..ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్. సమకాలీన భారత కళాకృతులు కన్సల్టెంట్

స్పెషలిస్ట్గా ఉన్న ఆమె క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ ను ప్రారంభించింది.49 ఏళ్ల మల్లిక.. 2001లో న్యూయార్క్ లో తొలిసారిగా నిర్వహించిన మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం లో భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆక్షనీర్గా అందరి దృష్టిని ఆకర్షించింది.

అనంతరం ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్ సంస్థ భాగస్వామిగా ముంబైలో ఎన్నో అరుదైన కళాకృతుల వేలం కార్యక్రమాలను నిర్వహించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆమె

తొలి మహిళ ఆక్షనీర్ కావడం విశేషం. 20201లో నిర్వహించిన ప్రో కబడ్డీ లీగ్ వేలం సందర్భంగా ఆమె అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన మహిళా ప్రీమియం లీగ్ వేలం కూడా ఆమె నిర్వహించింది. క్రికెట్ కు సంబంధించి వేలం నిర్వహించడం ఆమెకు అదే తొలిసారి అయినప్పటికీ ఎంతో ప్రతిభను కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

.”నేను నిర్వహించిన కళాకృతుల వేలం.. ఇప్పుడు నిర్వహిస్తున్న క్రీడ వేలం రెండు పూర్తిగా విభిన్నమైనవి.డబ్ల్యూపీఎల్ వేలం ప్రక్రియకు ముందు హ్యూగ్ ఎడ్మిడెస్ వీడియోలు చూసి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. వేలం నిర్వహించే సమయంలో నాకు అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.” అని ఆమె పేర్కొన్నారు.తొలిత క్రికెట్ వేలంపై అవగాహన లేకపోయినా.. కార్యక్రమ నిర్వహణ కోసం ఎన్నో విషయాలను నేర్చుకున్న ఆమె పట్టుదల, నిబద్ధత ఎందరికో స్ఫూర్తిదాయకం.