Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి గెలుస్తోంది !

ఇండియా కూటమి విజయపధంలో సాగుతోంది వచ్చేది మేమే అని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు

By:  Tupaki Desk   |   19 May 2024 3:38 AM GMT
ఇండియా కూటమి గెలుస్తోంది !
X

కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఇండియా కూటమి విజయపధంలో సాగుతోంది వచ్చేది మేమే అని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీది అంతా అసత్య ప్రచారమే అని కొట్టిపారేశారు. కేంద్రంలో అధికారంలోకి ఈసారి బీజేపీ రావడం కల అని ఆయన అంటున్నారు.

బీజేపీ నాలుగు వందల సీట్లు అని ప్రచారం చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆ సీట్లు బీజేపీ సాధించడం అన్నది అసాధ్యమని ఆయన తేల్చేశారు. అంతే కాదు బీజేపీకి ఉన్న సీట్లలోనే భారీ కోత పడబోతోంది అని ఖర్గే జోస్యం చెప్పారు.

అంటే గత ఎన్నికల్లో బీజేపీకి 304, ఎన్డీయే కూటమికి మరో ముప్పయి దాకా సీట్లు వచ్చాయి. ఇపుడు అన్నీ కలిపినా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేరు అని ఆయన అంటున్నారు. దాంతో బీజేపీ సొంతంగా కానీ ఎన్డీయే మిత్రులతో కానీ మ్యాజిక్ ఫిగర్ అయిన 273ని అందుకోలేదు అని ఆయన స్పష్టం చేశారు.

అదే టైంలో ప్రతీ విడత పోలింగులో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు పెంచుకుంటూ పోతోంది అని ఆయన తెలిపారు ఇప్పటికి నాలుగు విడతల పోలింగ్ ముగిసిందని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి కంటే ఇండియా కూటమి ఆధిక్యతతో ఉందని ఆయన చెప్పారు. అంటే ఇప్పటికి 376 సీట్లకు పోలింగ్ జరిగింతే బీజేపీ కంటే కూడా ఎక్కువ సీట్లు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ఆయన ధీమాగా చెబుతున్నారు.

బీజేపీ కేవలం వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తోందని కూడా ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. ఇండియా కూటమి నేతలపైన తన చేతిలో ఉన్న వ్యవస్థలను పురిగొలిపి ఎన్నో రకాలుగా వేధించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎన్ని చేసినా ఎన్ని రకాలైన ఎత్తుగడలు వేసినా కూడా గెలుపు ఆ పార్టీకి ఈసారి అసాధ్యం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమికి మెజారిటీ వస్తుందని తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఖర్గే సహా ఇండియా కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే నిజంగా కనుక ఇండియా కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. రాహుల్ గాంధీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన కూడా ఈసారి భారీ ఎత్తున పాదయాత్రలతో ప్రజలకు చేరువ అయ్యారు. దాంతో యువ నాయకత్వానికే పట్టం కడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఇండియా కూటమి ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయో అన్నది.