Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి స్టీరింగ్ మమత చేతిలోకి ?

దేశంలో రెండు కూటములు ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ ఈ రెండు కూటములలోనే చేరిపోయాయి.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:10 AM GMT
ఇండియా కూటమి స్టీరింగ్ మమత చేతిలోకి ?
X

దేశంలో రెండు కూటములు ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ ఈ రెండు కూటములలోనే చేరిపోయాయి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన పార్టీలే తటస్థంగా ఉన్నాయి. ఒక వేళ జమిలి ఎన్నికలు తోసుకుని వస్తే ఆ పార్టీలు కూడా ఏదో కూటమిలో చేరాల్సిందే. ఎందుకంటే జమిలి ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే అధికంగా పడుతుంది కాబట్టి అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమి కట్టి చాలా కాలమే అయింది. కూటమి కట్టాక గట్టిగా ఒక పొలిటికల్ హిట్ కూడా దక్కలేదు. కూటమిగా వెళ్ళినా ఫలితాలు పెద్దగా రావడం లేదు. 2024 ఎన్నికల్లో కూడా కొంత మెరుగ్గా ఉన్నా ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. కేంద్రంలో అధికారం అందని పండుగానే మారింది.

ఇక ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవికి ఎవరినీ ఓపెన్ గా ప్రాజెక్ట్ చేయకపోయినా రాహుల్ గాంధీ పేరు మాత్రం వినిపిస్తోంది. ఆయనే ప్రధాని నరేంద్ర మోడీకి పోటీ అని ప్రాజెక్ట్ చేయబడుతోంది. దానికి తగినట్లుగానే రాహుల్ సైతం మోడీ మీదనే విమర్శల బాణాలు సంధిస్తున్నారు.

భారత్ జోడో యాత్రలు చేశారు. తన పార్టీని సంస్థాగతంగా మార్పులు చేసుకుని బడుగు బలహీన వర్గాలకు చెందిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా చేశారు. మిత్రులతో బాగానే స్నేహం చేస్తున్నారు పొత్తులు కలుపుతున్నారు. ఇంత చేసినా కూడా ఇండియా కూటమి మాత్రం జనంలో పెద్దగా ఫోకస్ కావడం లేదు.

దేశంలో ఇంటీవల జరిగిన అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి పాలు అవుతోంది. ఇక గెలిచిన చోట కూడా కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండానే ఉంది. దాంతో పాటు గత మూడు ఎన్నికల నుంచి మోడీ వర్సెస్ రాహుల్ అని అంటున్నారు. అయితే జనాలు మోడీనే గెలిపిస్తున్నారు. రాష్ట్రాలలో అదే సీన్ రిపీట్ అవుతోంది.

దాంతో మోడీకి సరి జోడు రాహుల్ గాంధీ కారు అన్న భావన మీద కూడా చర్చ సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దేశంలో 48 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బీజేపీ చేతిలో చాలా పోగొట్టుకుంది. కానీ బెంగాల్ లో మాత్రం ఆరింటికి ఆరు సీట్లూ గెలిచి మమతా బెనర్జీ బీజేపీకి ఖంగు తినిపించారు. అంతే కాదు 2021లో జరిగిన ఎన్నికల్లో మూడవసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సీఎం గా నిలిచారు

దాంతో మోడీని ఎదుర్కొనే సత్తా మమతకే ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇండియా కూటమి సారథ్యాన్ని మమతకు అప్పగించాలని డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. మమతా బెనర్జీ మోడీకి అపొజిషన్ గా ఉంటూ కూటమిని నడిపిస్తే రానున్న ఎన్నికల్లో అ ప్రజల ఆలోచనలు కూడా మారుతాయని అది ఇండియా కూటమికి వరంగా కూడా మారుతుందని అంటున్నారు.

ఇండియా కూటమిలో మమతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆమెను కన్వీన్వర్ గా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ గా వస్తోంది. ఇదే తీరున ఇండియా కూటమి ఉంటే కనుక ఎప్పటికీ ఎన్డీయే చేతిలో పరాజయాలే అన్న మాట కూడా వినిపిస్తున్నారు. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో చురుకైన నాయకత్వం ఇండియా కూటమికి అవసరం అని అంటున్నారు. మరి మమత చేతికి ఇండియా కూటమి స్టీరింగ్ అప్పచెబుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఏ రోజుకు అయినా కాంగ్రెస్ నుచే కొత్త ప్రధాని రావాలని వస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని కూడా అంటున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఇతర ప్రాంతీయ పార్టీల మాదిరిగానే అతి పెద్ద పార్టీగానే ఉంది అన్నది ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల భావన. మరి ఇదే తీరున నాయకత్వం కోసం పోరు సాగితే అది చివరికి ఇండియా కూటమిని ఏ వైపునకు లాగేస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.