అక్కడ బాబు హైలెట్...అందుకే అలా !
చంద్రబాబుకు అందుకే ఎన్డీయేలో అత్యంత గౌరవాభిమానాలు దక్కుతున్నాయి. బాబుని మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు
By: Tupaki Desk | 28 July 2024 12:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జాతకం పరుగులు పెడుతోంది. ఒకనాడు మోడీ అపాయింట్మెంట్ కోసం ఆయన వేచి చూసేవారు ఇపుడు మోడీని ప్రధానిగా చేసి మూడోసారి ఆయన దేశాన్ని ఏలే అవకాశాన్ని చంద్రబాబే కల్పించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబు అంటే అందులో డౌటే లేదు.
చంద్రబాబుకు అందుకే ఎన్డీయేలో అత్యంత గౌరవాభిమానాలు దక్కుతున్నాయి. బాబుని మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. ఆయన తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే ఏకంగా మాట్లాడేందుకు ఇరవై నిముషాలు కేటాయించారు. సాధారణంగా ముఖ్యమంత్రులకు అయిదు నుంచి పది నిముషాల సమయం మాత్రమే ఉంటుంది.
కానీ చంద్రబాబుకు ఇరవై నిముషాల దాకా మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వడం అంటే ఎన్డీయేలో ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత అని అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేవలం అయిదు నిముషాలు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆమె నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకు వచ్చి మీడియాకు చెప్పారు. చంద్రబాబుకు ఇరవై నిముషాలు టైం ఇచ్చారని ఆమె చెప్పారు.
పైగా తాను మాట్లాడేటపుడు తన మైకు కట్ చేశారని ఆరోపించారు. అయితే ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని నీతి ఆయో సీఎఓ ఆ తరువాత ప్రకటించారు. ఎవరు ఏమి చెప్పినా మమతా బెనర్జీ విపక్షానికి చెందిన ముఖ్యమంత్రి. ఆమె మోడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు. అంతే కాదు ఆమె నీతి ఆయోగ్ సమావేశంలో కూడా తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వం మీద చేయాలనుకున్నారని అంటున్నారు.
అందుకే ఆమెకు అలా తక్కువ టైం ఇచ్చి మైక్ కట్ చేశారని అంటున్నారు. ఇది తనకు అవమానం అని మమత అంటున్నారు. అదే టైం లో చంద్రబాబుకు ఎక్కువ సమయం ఇవ్వడం అన్నది వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రోజు ఎన్డీయేకు చక్రధారి. ఆయన అవసరం చాలా ఉంది. బాబు తలచుకుంటే కేంద్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయి.
అందుకే బాబుని పక్కన పెట్టుకుని చాలా గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం అయితే బీజేపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక బాబుకు రానున్న కాలమంతా ఢిల్లీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వద్ద మర్యాదలకు ఎలాంటి లోటూ ఉండదని అంటున్నారు. అయితే దీనిని ఆయన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే విభజన వల్ల కునారిల్లిన ఏపీ వేగంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఏది ఏమైనా ప్రధాని మోడీ తరువాత దేశంలోని ముఖ్యమంత్రులలో టాప్ ప్రయారిటీ బాబుకే లభిస్తోంది అన్నది వాస్తవం. అది రాజకీయ గణితం అని అర్ధం చేసుకోలేనంత అమాయకురాలు అయితే మమతా బెనర్జీ కారు. సో ఎవరికి ఎపుడు టైం వస్తుందో మరి. ఆ టైం వచ్చేంతవరకూ ఆగాలి. ఏమైనా బాబు హైలెట్ కావడం మాత్రం నీరి ఆయోగ్ లో ఒక విశేషంగానే చూస్తున్నారు