మమతా కులకర్ణీకి బిగ్ షాక్... బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలే కారణమా?
ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసినిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:22 AM GMTఉత్తరప్రదేశ్ లోని రాజ్ ప్రయాగ్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సాధువులు, సన్యాసులు, అఘోరాలు, బాబాలు పాల్గొంటున్నారు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
ఈ విషయం చాలా మందికి సర్ ప్రైజ్ గా ఉంటే.. మరికొంతమందికి షాకింగ్ గా మారింది. ఈ సమయంలో ఆమె ప్రాపంచైక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారారు. కిన్నెర అఖాడాలో చేరారు. మాహామండలేశ్వర్ గా ఆమె దీక్షను చేపట్టారు. ఈ సమయంలో అమెకు తాజాగా ఆ కిన్నెర అఖాడా షాకిచ్చింది. అక్కడ నుంచి బహిష్కరించింది.
అవును.. ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసినిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు. ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశరు. కిన్నెర అఖాడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు.
వాస్తవానికి ఆమె అఖాడాలో చేరిన అనంతరం.. పలువురు మతపెద్దలు నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి తోడు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీంతో.. ఆమెతో పాటు ఆమెను చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠీని సైతం అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
ఈమె కిన్నెర అఖాడాలో చేరడం ఒకెత్తు అయితే.. చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందడం మరొకెత్తు అంటూ పలువురు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బాబా రామ్ దేవ్ స్పందిస్తూ... మహా కుంభమేళా అనేది పవిత్ర కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇదే సమయంలో... ఇప్పటివరకూ ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రభావల ఫలితంగా ఆమెపై బహిష్కరణ వేటు వేసినట్లు చెబుతున్నారు.