కండక్టర్ ని కత్తితో పొడిచింది అందుకే... నిందితుడి షాకింగ్ సమాధానం!!
కర్ణాటక రాజధాని బెంగళూరులో బస్సులో ఫుట్ బోర్డింగ్ చేస్తున్న ఓ యువకుడిని.. అలా చేయొద్దని చెప్పాడు కండక్టర్. దీంతో.. ఆ యువకుడు కండక్టర్ ను కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Oct 2024 11:30 AM GMTకర్ణాటక రాజధాని బెంగళూరులో బస్సులో ఫుట్ బోర్డింగ్ చేస్తున్న ఓ యువకుడిని.. అలా చేయొద్దని చెప్పాడు కండక్టర్. దీంతో.. ఆ యువకుడు కండక్టర్ ను కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. అలా కండక్టర్ ను కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు.. బస్సులో ఉన్న ప్రాయాణికులను బెదిరించి, భయాందోళనకు గురిచేశాడు!
దీంతో విషయం తెలుసుకున్న బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీసులు ఆ యువకుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సమయంలో నిందితుడిని జార్ఖండ్ కు చెందిన హర్ష సిన్హా (25)గా గుర్తించారు. అతడు బీపీఓ సంస్థలో ఉద్యోగం చేసేవాడని.. అయితే అతడిని ఇటీవల విధుల నుంచి తొలగించారని అంటున్నారు.
ఇక బాధితుడు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కండక్టర్ యోగేష్ (45)ను హుటాహుటున ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సంరక్షణ అందించిన తర్వాత అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెబుతున్నారు. అయితే తాను ఈ ఘటనకు పాల్పడటానికి గల కారణం వేరే అంటూ నిందితుడు ఓ షాకింగ్ విషయం చెప్పాడని అంటున్నారు.
అవును... సాయంత్రం 5:15 గంటల సమయంలో బీఎంటీసీ వోల్వో బస్సుల్లో ప్రయాణిస్తూ వైట్ ఫీల్డ్ లోని వైదేహి సర్కిల్ సమీపంలోకి రాగానే కండక్టర్ డోర్ దగ్గర నిలబడోద్దాన్నాడని కత్తితో పొడిచిన యువకుడు.. పోలీసుల విచారణలో చెప్పిన విషయాలు, అందుకు గల కారణాలు షాకింగ్ గా ఉన్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఉద్యోగం పోయిందన్న కోపం, ఒకటికి రెండుసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినా మరో జాబ్ రాలేదన్న ఆగ్రహంతో ఉన్న తాను.. జైలుకు వెళ్లాలన్న ఉద్యేశ్యంతోనే కండక్టర్ ను పొడిచినట్లు యువకుడు చెప్పాడని అంటున్నారు. తాను ఆగ్రహంతో ఉన్నప్పుడు కండక్టర్ చెప్పిన మాటలకు ఉక్రోషం పట్టలేక 5-6 సార్లు కత్తితో పొడిచినట్లు చెప్పాడని అంటున్నారు.
మరోపక్క.. కండక్టర్ ను కత్తితో పొడిచిన సమయంలోనే.. జైలుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే తాను పొడిచినట్లు స్థానికులతో చెప్పాడని అంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలోనూ వెళ్లడించినట్లు చెబుతున్నారు.