Begin typing your search above and press return to search.

ఒక్క మైదానం..లక్ష సీట్లు.. రూ.81వేల కోట్లు... ఏమిటీ వ్యవహారం!

భారతదేశంలో క్రికెట్ ఎంత ఫేమస్సో.. చాలా దేశాల్లో ఫుట్ బాల్ అంత ఫేమస్ అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 1:10 PM GMT
ఒక్క మైదానం..లక్ష సీట్లు.. రూ.81వేల కోట్లు... ఏమిటీ వ్యవహారం!
X

భారతదేశంలో క్రికెట్ ఎంత ఫేమస్సో.. చాలా దేశాల్లో ఫుట్ బాల్ అంత ఫేమస్ అనే సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... బెట్టింగులు కాకుండా భారత్ లో క్రికెట్ పై ఇన్వెస్ట్ చేసినవాళ్లు పెద్దగా నష్టపోయిన దాఖళాలు లేవని అంటుంటారు. ఇదే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఓ అడుగు ముందుకే వేస్తుంటాయి.

ఇదే క్రమంలో చాలా దేశాల్లో ఫుట్ బాల్ కోసం స్పాన్సర్లు, ప్రభుత్వాలు సైతం భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఈ విధంగా గతంలో లాగా ఆటల్లో పెట్టుబడి పెట్టడం దండగ వంటి మాటలు ఇప్పుడు లేవు! ఈ వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్ట్ షాకింగ్ విషయాన్ని తెరపైకి తెచ్చింది.

అవును... తాజాగా ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ షాకింగ్ రిపోర్టును తెరపైకి తెస్తూ.. బ్రిటన్ కు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా.. ఒక్క ఫుట్ బాల్ క్లబ్ ఆధీనంలోని స్టేడియంను ఆధునీకరిస్తే ఏటా ఏకంగా రూ.81 వేల కోట్ల ఆదాయం బ్రిటన్ కు లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం ఆ దేశంలో అత్యంత సంచలన అంశంగా మారింది.

తాజాగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం, దాని చుట్టుపక్కల ఆధినికీకరణ ప్రాజెక్టు ఫీజుబులిటీపై ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ స్టడీ రిపోర్ట్ ను చేసి క్లబ్ కు సమర్పించింది. ఈ సందర్భంగా ఈ మైదానం ఉన్న గ్రేటర్ మాంచేస్టర్ ప్రాంతం ఆర్థికంగా ఎదగడానికి ఈ మైదానం ఉపయోగపడుతుందని ఆ నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని జిమ్ రాట్ క్లిఫ్ ఓ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... సుమారు $2 బిలియన్లు వెచ్చించి ప్రస్తుతం ఉన్న 74 వేల సీట్ల ఓల్డ్ ట్రాఫోర్డు కెపాసిటీని పెంచడం కానీ.. లక్ష సీట్లతో సరికొత్త స్టేడియంను నిర్మించడం కానీ చేసే ప్రతిపాదనలున్నాయని అంటున్నారు.

ఇలా స్టేడియంను ఆధునికీకరించడంతో పాటు దీని చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్సులు, ట్రాన్స్ పోర్టు సౌకర్యాలను వివిధ రకాల ప్రయోజనాలకు వినియోగించడం వంటివి ఉన్నాయని అంటున్నారు. దీనివల్ల.. 92వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని.. 17వేల కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్ హమ్... బ్రిటన్ లో జరుగుతున్న అతిపెద్ద ఆధినికీకరణ ప్రాజెక్ట్ ఇదే అవుతుందని.. ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియం నుంచి స్థానికులు కూడా లాభపడతారని అన్నారు.