Begin typing your search above and press return to search.

పెదరాయుడి ఇంట ఆస్తుల పంచాయతీ!... ఆడపడుచుపై కీలక బాధ్యత?

అయితే.. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ అంతా నార్మల్ గానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 11:38 AM GMT
పెదరాయుడి ఇంట ఆస్తుల పంచాయతీ!... ఆడపడుచుపై కీలక బాధ్యత?
X

గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ అంతా నార్మల్ గానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.

అవును... ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో మోహన్ బాబు గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు సీపీ ఇచ్చిన నోటీసులకు హైకోర్టు ఆశ్రయించడంతో ఈ నెల 24 వరకూ స్టే ఇచ్చింది.

ఇప్పుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం.. ఇప్పటికే కుమారులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ ఇంట్లోనే ఉండటం.. మరోపక్క ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించడానికి కుటుంబ సన్నిహితులు, పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెబుతుండటంతో... మోహన్ బాబు నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.

పైగా... జరుగుతున్న తగాదా అంతా ఆస్తుల కోసం కాదని, తన పోరాటం ఆత్మాభిమానం కోసమని మంచు మనోజ్ చెబుతున్నా... తన ఆస్తులు ఎవరికి ఇవ్వాలి, అసలు ఇవ్వాలా, దానధర్మాలు చేసుకోవాలా అనేది తన ఇష్టం అంటూ మోహన్ బాబు వాయిస్ తో వినిపించిన ఆడియోలో ఆస్తుల టాపిక్ తెరపైకి వచ్చిన పరిస్థితి.

మరోవైపు... జరుగుతున్న పరిణామాలకు కారణం ఆస్తులా, మనోజ్ - మౌనికల పెళ్లా అనే ప్రశ్నకు... కచ్చితంగా మౌనిక అయితే కారణం కాదని విష్ణు ఇటీవల మీడియాతో వెల్లడించిన పరిస్థితి! ఈ నేపథ్యంలోనే మంచువారి ఇంట ఆస్తుల పంపకాలపై చర్చ మొదలైందని అంటున్నారు.

పంపకాలకు మోహన్ బాబు ఒప్పుకుంటారా..?:

మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి తెలిసిన చాలా మంది... ఇంత రచ్చ జరిగిన నేపథ్యంలో ఇప్పట్లో ఆస్తుల పంపకాల టాపిక్ ఎత్తకపోవచ్చని అంటున్నారని తెలుస్తోంది. తనను బెదిరించి, ఇంత రచ్చ చేసి ఆస్తులు తీసుకున్నారని జనం అనుకుంటారనో.. లేక, వాళ్లు బెదిరిస్తే తాను బెదిరిపోయి తన ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని చర్చించుకుంటారనే భావనో అందుకు కారణం కావొచ్చని అంటున్నారు.

శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి ఒత్తిడి..!?:

ఉన్న ముగ్గురు పిల్లలకు పెళ్లిల్లు అయిపోయాయి, పిల్లలు ఉన్నారు, ఇప్పటికే అభిప్రాయ బేధాలు వచ్చిన పరిస్థితి, ఈ సమయంలో ఇంకా నాన్చడం కరెక్ట్ కాదని.. ఎవరికి ఎంత ఇవ్వాలని భావిస్తున్నావో అంతా పంపకాలు చేసెయ్యమని మోహన్ బాబుపై సన్నిహితులు, స్నేహితులు ఒత్తిడి తెస్తున్నారనే చర్చా నడుస్తుందని అంటున్నారు.

మంచు లక్ష్మి మాటే కీలకమా?:

మోహన్ బాబు ఈ ప్రపంచంలో ఎవరి మాట విన్నా వినకపోయినా.. తన కుమార్తె మంచు లక్ష్మీ మాట మాత్రం కాదనరని అంటుంటారు. మోహన్ బాబుతో "ఎస్" చెప్పించాలంటే అది మంచు లక్ష్మీకే సాధ్యం అని చెబుతుంటారు. ఈ సమయంలో... ఇంటి ఆడపడుచు పాత్ర ఈ వ్యవహారం, ఈ సమయంలోలో కీలకం కాబోతుందని అంటున్నారు.

మౌనికను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో ఎవరూ సంపూర్ణ మద్దతు, పూర్తి అంగీకారం తెలిపినట్లు కనిపించకపోయినా.. తమ్ముడిపై ప్రేమతో మంచు లక్ష్మే అన్నీ దగ్గరుండి చూసుకున్నారని గుర్తు చేస్తున్నారు. మంచు ఇంట ఎలాంటి అసాధ్యమైనా.. ఆడపడుచు తలచుకుంటే సాధ్యమవుతుందని అంటున్నారని తెలుస్తోంది.

మోహన్ బాబు 'ఓకే' అంటే...?

మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ఇదో చర్చ మొదలైందని అంటున్నారు. మోహన్ బాబు ఇప్పటికిప్పుడు ఆస్తులు పంచాలని ఫిక్స్ అయినా.. ఒత్తిడికి అంగీకరించినా.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. ఈ సమయలో ఓ ఆసక్తికర ఊహాగాణం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇప్పుడు కొడుకులిద్దరికి 20%, 20%, కుమార్తెకు 20% ఆస్తులు పంచి.. తన వద్ద 40% ఆస్తులు పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు!

ఇలా ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని ఊహాగాణాలు తెరపైకి వచ్చినా, మరెన్ని గాసిప్స్ ప్రచారంలో పెట్టినా... ఫైనల్ గా అది పద్మశ్రీ మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం. జీవితంలో దాదాపు అన్నీ చూసేసిన పెదరాయుడికి.. ఎప్పుడు ఏమి చేయాలో, ఎలా చేయాలో బాగా తెలుసని.. ఎం ధర్మరాజు ఎంఏ కి ఎవరు సలహాలు ఇవ్వనవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారని తెలుస్తోంది. మరి ఏమి జరగబోతోందనేది ఆసక్తి ఉన్నవారు వెయిట్ అండ్ సీ!